ఉత్తరభారతానికి రంగుల అలర్ట్

పక్షం రోజులుగా యావత్ భారతావని భారీ వర్షాలతో తడిసిముద్దవుతోంది. వాతావరణ శాఖ తాజాసమాచారం ప్రకారం వచ్చే మూడు రోజుల పాటు ఉత్త‌ర భార‌త దేశంలో..

ఉత్తరభారతానికి రంగుల అలర్ట్
Follow us

|

Updated on: Aug 27, 2020 | 7:25 PM

పక్షం రోజులుగా యావత్ భారతావని భారీ వర్షాలతో తడిసిముద్దవుతోంది. వాతావరణ శాఖ తాజాసమాచారం ప్రకారం వచ్చే మూడు రోజుల పాటు ఉత్త‌ర భార‌త దేశంలో మరింత తీవ్రత ఉండబోతోంది. భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయి. ఉత్త‌రాఖండ్ రాష్ట్రానికి ఆగ‌స్టు 27, 28వ తేదీల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌ను.. ఆ త‌ర్వాత రెండు రోజుల‌కు ప‌సుపు రంగు హెచ్చ‌రిక‌ల‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక.. ఆగ‌స్టు 28వ తేదీన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు, ఆగ‌స్టు 20,30 తేదీల‌కు రాజ‌స్థాన్‌లో ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేశారు.

ఇక, జ‌మ్మూక‌శ్మీర్‌కు ఆగ‌స్టు 27న‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు ఆగ‌స్టు 27,28 తేదీల్లో పసుపురంగు అల‌ర్ట్ జారీ చేశారు. రోజుల తరబడి కురుస్తోన్న భారీ వర్షాలకు ఉత్తరాదిలో ఇప్పటికే అనేక న‌దులు ప్రమాదస్థాయిదాటి ప్ర‌వ‌హిస్తున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలోనూ య‌మునా న‌ది ఉగ్రరూపం దాల్చింది. అటు, హ‌ర్యానాలోని హ‌త్నీకుండ్ బ్యారేజ్ దగ్గర నీటిమట్ట ప్రమాదకర స్థాయిలోనే ఉంది. అటు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మొత్తం 19 జిల్లాలు భారీ వరదలకు అతలాకుతలమయ్యాయి.