టీ20లకు వార్నర్ రిటైర్మెంట్..?

Warner Won Allan Border Medal: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ త్వరలోనే ఓ ఫార్మాట్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఇక ఈ విషయాన్ని స్వయంగా అతడే నిర్ధారించాడు. తాజాగా ఆస్ట్రేలియన్ టీ20 ప్లేయర్ అఫ్ ది ఇయర్, అలెన్ బోర్డర్ మెడల్‌లను గెలుపొందిన అతడు పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం గమనార్హం. మూడు ఫార్మాట్లలో ఆడటం చాలా కష్టమన్న వార్నర్.. అలా ఆడుతున్న క్రికెటర్లకు అభినందనలు తెలిపాడు. చాలా ఏళ్ళ నుంచి సుధీర్ఘంగా వన్డేలు, టెస్టులు, […]

టీ20లకు వార్నర్ రిటైర్మెంట్..?
Follow us

|

Updated on: Feb 12, 2020 | 1:44 PM

Warner Won Allan Border Medal: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ త్వరలోనే ఓ ఫార్మాట్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఇక ఈ విషయాన్ని స్వయంగా అతడే నిర్ధారించాడు. తాజాగా ఆస్ట్రేలియన్ టీ20 ప్లేయర్ అఫ్ ది ఇయర్, అలెన్ బోర్డర్ మెడల్‌లను గెలుపొందిన అతడు పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం గమనార్హం.

మూడు ఫార్మాట్లలో ఆడటం చాలా కష్టమన్న వార్నర్.. అలా ఆడుతున్న క్రికెటర్లకు అభినందనలు తెలిపాడు. చాలా ఏళ్ళ నుంచి సుధీర్ఘంగా వన్డేలు, టెస్టులు, టీ20ల్లో ఆడుతున్న సెహ్వాగ్, డివిలియర్స్‌ను అడిగితే ఆ విషయం అర్థమైందని స్పష్టం చేశాడు. ఒకవేళ తన కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ఏదైనా ఫార్మాట్‌ను వదిలేయాలంటే ఖచ్చితంగా టీ20లనే ముందు ఎంచుకుంటానని స్పష్టం చేశాడు.

బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు ఆటకు దూరమైన వార్నర్.. పునరాగమనంలో అద్భుతమైన ఫామ్‌ను కనబరిచి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఐపీఎల్, ఇంగ్లాండ్‌తో టెస్టులు, భారత్‌తో వన్డేలు.. ఇలా అన్నింటిలోనూ పరుగుల వరద పారించాడు. అటు ఐపీఎల్‌లో కూడా హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు కీలకమైన ఆటగాడిగా మారిన వార్నర్.. తొందరలోనే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పడం క్రికెట్ ఫ్యాన్స్‌కు కొంత నిరాశను మిగిలిస్తుందని చెప్పాలి.  ప్రస్తుతం టెస్టుల్లో ఐదవ స్థానంలో ఉన్న వార్నర్.. త్వరలో జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌కు సన్నద్ధం అవుతున్నాడు.