రాత్రి భోజనానికి తిరిగొస్తానంటూ వెళ్లి అనంత లోకాలకు..
న్యూజీలాండ్‌లో ఉబర్ ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న పంజాబ్‌కు చెందిన రమణ్‌దీప్ ధిల్లన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. “డిన్నర్‌కి ఇంటికి వస్తా” అని చెప్పి వెళ్లిన అతడు కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఏడాదిన్నర చిన్నారితో ఒంటరిగా మిగిలిన భార్యకు అండగా ప్రవాస భారతీయులు ముందుకొచ్చి విరాళాలు సేకరిస్తున్నారు.
పంజాబ్‌కు చెందిన రమణ్‌దీప్ ధిల్లన్ న్యూజీలాండ్‌లో టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లాడు. అతడు ఉబర్ ట్యాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆరోజు కూడా పికప్ కోసం వెళ్లాడు. అయితే..’హైవే’పై అతని వాహనాన్ని మరొక వాహనం బలంగా ఢీకొట్టింది. దాంతో రమణ్‌దీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అవతలి వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రమణ్‌దీప్ ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో 2015లో స్టూడెంట్ వీసాపై న్యూజీలాండ్ వెళ్లాడు. అనంతరం 2024లో స్వదేశానికి వచ్చి వీర్‌పాల్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత వారు పాపామోవాలో స్థిరపడ్డారు. వీరికి ఏడాదిన్నర కుమార్తె ఉంది. పాపను చూసుకోవడానికి వీలుగా ఉంటుందని.. సమయం కలిసి వస్తుందని రమణ్‌దీప్ పార్ట్ టైమ్ ఉబెర్ డ్రైవర్‌గా మారాడు. “రాత్రి భోజన సమయానికి ఇంటికి వచ్చేస్తా” అని భార్యకు చెప్పి వెళ్లిన రమణ్‌దీప్.. కొన్ని గంటల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన స్థానికంగా ఉన్న ప్రవాస భారతీయులను తీవ్రంగా కలచివేసింది.న్యూజీలాండ్‌లోని వేరు వేరు నగరాల నుంచి వందలాది మంది ప్రవాస భారతీయులు తరలివచ్చి బుధవారం జరిగిన రమణ్‌దీప్ అంత్యక్రియలలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఒంటరిగా మిగిలిపోయిన ఆ తల్లిని, చిన్నారిని ఆదుకునేందుకు స్థానికంగా క్రౌడ్ ఫండింగ్ పేజీని ఏర్పాటు చేశారు. రమణ్‌దీప్ అంత్యక్రియల ఖర్చులు, ఇంటి అద్దె, ఆ కుటుంబ దైనందిన అవసరాల కోసం ఇప్పటి వరకు దాదాపు సుమారు రూ.27 లక్షలకు పైగా విరాళాలు సేకరించారు. ఆ విషాదాన్ని తట్టుకోలేక రమణ్‌దీప్ భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆ వార్త వినగానే తన ప్రపంచం బద్దలైందనీ తన జీవితం ఇక శూన్యం అనిపించిందనీ ఆమె తెలిపింది. భర్త తనపై చూపించిన ప్రేమను ఎప్పటికీ మరువలేనని చెప్పింది. ప్రస్తుతం ఏడాదిన్నర వయసున్న చిన్నారి తండ్రి నవ్వునే పోలి ఉందని.. నిరంతరం తండ్రి ఎక్కడంటూ వెతుకుతోందని కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉపాధి కోసం సుదూర తీరాలకు వెళ్లి, అక్కడ ఇప్పుడిప్పుడే ఒక అందమైన సంసారాన్ని నిర్మించుకుంటున్న ఆ భారతీయ ప్రవాసి కుటుంబంలో ఊహించని రోడ్డు ప్రమాదం పూడ్చలేని విషాదం నింపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంబులెన్స్‌లో తిరుగుతూ అమ్మాయిలను చంపేసే సైకో.. OTTలో ఈ రోడ్ సైడ్ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
RGV: ఆ స్టార్‌పై నాకు కోపం, ద్వేషం.. RGV ఎమోషనల్ ట్వీట్
రూ. లక్ష క్యాష్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన శునకం..!
Randeep Hooda: ఆ సినిమాలో ఇరుక్కుని.. మరిన్ని ఇబ్బందులు పడాలనుకోలేదు
Donald Trump: మోదీకి నేను బిగ్ ఫ్యాన్.. ఏది అడిగినా ఇచ్చేస్తా
