Viral Video: తోటలో పనిచేసుకుంటున్న వ్యక్తిపై విమానం నుంచి కుప్పలు కుప్పలుగా పడిన పదార్ధాలు.. ఏంటో తెలిస్తే షాకె..!(వీడియో)
మానవ వ్యర్థాలు.. ఈ మాట వింటేనే జనం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మరి అలాంటిది ఆకాశం నుంచి కుప్పలు, కుప్పలుగా వచ్చి మీద పడితే .. భయంకరంగా ఉంటుంది కదా. బ్రిటన్‌లో ఒక వ్యక్తికి ఇలాంటి ఘోరమైన అనుభవం ఎదురైంది...
మానవ వ్యర్థాలు.. ఈ మాట వింటేనే జనం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మరి అలాంటిది ఆకాశం నుంచి కుప్పలు, కుప్పలుగా వచ్చి మీద పడితే .. భయంకరంగా ఉంటుంది కదా. బ్రిటన్‌లో ఒక వ్యక్తికి ఇలాంటి ఘోరమైన అనుభవం ఎదురైంది. గార్డెన్‌లో పనిచేసుకుంటున్న మనిషిపై అటుగా వెళ్తున విమానం నుంచి మానవ వ్యర్థాలు గుమ్మరించిన వ్యవహారం కలకలం రేపింది. తోటలో హాయిగా పనిచేసుకుంటున్న ఆ వ్యక్తిపైన విమానంలో నుంచి జారవిడిచిన వ్యర్థాలు ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. అలాగే అతని గార్డెన్‌లో ఉన్న పలు మొక్కలపై కూడా పడ్డాయి. దీంతో వ్యర్థాలు పడిన వెంటనే అతడు గార్డెన్ నుంచి దూరంగా పారిపోయాడు. 2021 జూలైలో ఇంగ్లండ్‌లోని విండ్సర్ సమీపంలో హీత్రూ విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారెన్ డావిస్ జోక్యం ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రూట్ ట్రాకింగ్ యాప్ ద్వారా ఆ విమానం ఎటు వెళ్లిందో బాధితుడు కనిపెట్టడం విశేషం. మరోవైపు ఆ విమానం పేరును బయటపెట్టడానికి గాని, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌కు కూడా బాధితుడు ఇష్టపడలేదు. విండ్సర్ అండ్ మేడెన్ హెడ్‌కి చెందిన ది రాయల్ బోరో ఏవియేషన్ ఫోరమ్‌తో కారెన్ డావిస్ ఈ విషయాన్ని షేర్ చేశారు. విమానంలో నుంచి పడిన వ్యర్థాలు మొత్తం తోటంతా చాలా అసహ్యకరమైన రీతిలో పడ్డాయని వివరించారు. ఇలాంటి అనుభవం మరెవ్వరికీ రాకూడదని ఆమె వ్యాఖ్యానించారు. అయితే విమానంలోంచి జారవిడిచే మానవ వ్యర్థాలకు సంబంధించి తరచూ ఇలాంటి ఘటనలు నమోదవుతూ ఉంటాయన్నారు. సాధారణంగా విమానాల నుంచి వదిలినపుడు ఎత్తైన ప్రదేశాల్లోని ఉష్ణోగ్రతకు తక్షణమే గట్ట కట్టి, కింద పడతాయని డావిస్ చెప్పారు. కానీ తాజా ఘటనలో మాత్రం దీనికి భిన్నంగా జరిగిందని చెప్పుకొచ్చారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..