Genetic Testing: క‌పుల్స్‌కు కొత్త నిబంధ‌న‌.. DNA టెస్ట్ చేసుకున్నాకే పెళ్లి అనుమతి.

|

Feb 12, 2024 | 10:25 AM

పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్న జంట ముందుగా జ‌న్యు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌న్న నిబంధ‌న విధించారు రష్యా వైద్యులు. ఆరోగ్య‌క‌ర‌మైన పిల్ల‌లు పుట్టాలంటే జ‌న్యు ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి అంటున్నారు. పెళ్లికి ముందు రిజిస్ట్రీ ఆఫీసులో క‌చ్చితంగా స‌ర్టిఫికేట్‌ను జ‌త‌ప‌రచాలని నిబంధన విధించారు డాక్టర్లు . ర‌ష్యాలోని రిప‌బ్లిక్ ఆఫ్ బ‌ష్కోర్టోస్ట‌న్‌లో డాక్టర్ల సరికొత్త ప్ర‌తిపాద‌న‌ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.

పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్న జంట ముందుగా జ‌న్యు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌న్న నిబంధ‌న విధించారు రష్యా వైద్యులు. ఆరోగ్య‌క‌ర‌మైన పిల్ల‌లు పుట్టాలంటే జ‌న్యు ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి అంటున్నారు. పెళ్లికి ముందు రిజిస్ట్రీ ఆఫీసులో క‌చ్చితంగా స‌ర్టిఫికేట్‌ను జ‌త‌ప‌రచాలని నిబంధన విధించారు డాక్టర్లు . ర‌ష్యాలోని రిప‌బ్లిక్ ఆఫ్ బ‌ష్కోర్టోస్ట‌న్‌లో డాక్టర్ల సరికొత్త ప్ర‌తిపాద‌న‌ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. బ‌ష్కిర్ రాష్ట్ర ఆరోగ్య శాఖ చైర్మెన్ స‌లావ‌త్ ఖ‌ర్సోవ్ తాజా ఆదేశాల‌పై ఓ క్లారిటీ ఇచ్చారు. పెళ్లి చేసుకోబోయే జంట త‌ప్ప‌నిస‌రిగా డీఎన్ఏ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని, జ‌నటిక్ స్క్రీనింగ్‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని అన్నారు. ఒక‌వేళ ఆ జంట పెళ్లి చేసుకుంటే, వాళ్ల‌కు పుట్ట‌బోయే బిడ్డ‌కు ఎటువంటి రుగ్మ‌త‌లు కానీ అంగ‌వైక‌ల్యం కానీ ఉండ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు చెప్పారు.

దేశంలో జ‌న‌న రేటును పెంచాల‌న్న ప్రభుత్వ ఒత్తిడి వ‌ల్ల కొన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. ఒక‌వేళ ఏదైనా లోపంతో పిల్ల‌లు జ‌న్మిస్తే, అప్పుడు అది జ‌న్యు సంబంధిత స‌మ‌స్య అవుతుంద‌ని, అలాంటి ఉప‌ద్ర‌వాలు జ‌ర‌గ‌కుండా ఉండేందుకే జ‌న్యు ప‌రీక్ష‌ల‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తున్నామ‌ని ఖ‌ర్సోవ్ తెలిపారు. మ్యారేజీకి అనుమ‌తి కావాలంటే క‌పుల్స్ క‌చ్చితంగా డీఎన్ఏ టెస్టు చేసుకోవాల్సిందే అన్నారు. ఈ ప్రతిపాదనపై కొంద‌రు వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నారు. జంటలను ఇది ఒత్తిడికి గురి చేస్తుంద‌ని ఆ రాష్ట్ర కార్మిక మంత్రి లెన‌రా ఇవ‌నోవా తెలిపారు. ర‌ష్యాలో ప్ర‌తి ఏడాది సుమారు 25 వేల మంది శిశువులు జ‌న్యుప‌ర‌మైన వ్యాధుల‌తో జ‌న్మిస్తున్నారు. ఎక్కువ సంఖ్య‌లో పిల్ల‌ల‌ను క‌నాల‌ని ఇటీవ‌ల పుతిన్ ఆదేశాలు ఇచ్చారు. జన్యుప‌ర‌మైన వ్యాధుల జాబితాను కూడా రిలీజ్ చేశారు. లోపాన్ని గుర్తిస్తే ముందే జాగ్రత్తపడవచ్చు అన్న అభిప్రాయాన్ని డాక్ట‌ర్లు వ్య‌క్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..