భారతీయ నర్స్ కుటుంబాన్ని బహిష్కరించిన ఆస్ట్రేలియా

Updated on: May 25, 2026 | 4:59 PM

ఆస్ట్రేలియాలో స్థిరపడాలన్న ఆశతో వెళ్లిన కేరళ కుటుంబానికి పెద్ద షాక్ తగిలింది. తమ ఆరేళ్ల కుమారుడి ఆరోగ్య సమస్యను కారణంగా చూపుతూ ఆస్ట్రేలియా ప్రభుత్వం పర్మినెంట్ రెసిడెన్సీ నిరాకరించింది. ప్రస్తుతం దేశ బహిష్కరణ భయంతో జీవిస్తున్న ఆ కుటుంబానికి వేలాది మంది ఆస్ట్రేలియన్లు మద్దతుగా నిలుస్తున్నారు. ‘మా పిల్లల భవిష్యత్తు కోసం మమ్మల్ని ఇక్కడే ఉండనివ్వండి’ అంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

ఆస్ట్రేలియాలో స్థిరపడాలనే ఆశతో వెళ్లిన ఓ భారతీయ కుటుంబానికి అక్కడ అన్యాయం జరిగింది. తమ ఆరేళ్ల కుమారుడికి ఉన్న శారీరక ఎదుగుదల లోపాన్ని కారణంగా చూపిస్తూ, ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ కుటుంబానికి పర్మినెంట్ రెసిడెన్సీ నిరాకరించింది. వారిని దేశం నుంచి బహిష్కరించేందుకు సిద్ధమైంది. కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన ఆ కుటుంబం ప్రస్తుతం విక్టోరియాలోని బెండిగో నగరంలో తీవ్ర ఆందోళనతో కాలం వెళ్లదీస్తోంది. క్రిస్టిన్ దాస్‌ విక్టోరియాలోని ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమె భర్త జినీష్‌ జోసెఫ్‌ క్వాలిఫైడ్‌ షెఫ్‌ అలాగే కొడుకు బాగోగులు చూసుకునే పూర్తిస్తాయి కేర్‌గివర్‌ కూడా. వీరికి ఇద్దరు పిల్లలు. బతకడానికి వచ్చిన తమ బిడ్డ అనారోగ్యాన్ని సాకుగా చూపి.. తమకు వీసా నిరాకరించడం ఏంటని వీరు ఆవేదన అనుభవిస్తున్నారు. గతంలో ఈ కుటుంబం ఐర్లాండ్‌లో ఉండేది. ఆస్ట్రేలియా వీసా లభించడంతోనే వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. వీసా దరఖాస్తు ప్రక్రియలోనే తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితిని తాము స్పష్టంగా తెలియచేసామని చెబుతున్నారు. ఒకవేళ అప్పుడే వీసా తిరస్కరించి ఉంటే, తాము ఐర్లాండ్‌లోనే ఉండేవారమని, ఇప్పుడు ఇక్కడ అన్నీ సెట్‌ చేసుకున్నాక నడిరోడ్డుపై వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తమ కుమారునికి అందుతున్న వైద్య సహాయం ఆగిపోతే, వాడి భవిష్యత్తు ఏంటని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఆ కేరళ కుటుంబం ‘Change.org’ వేదికగా డిజిటల్ పిటిషన్ వేసింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తమను దేశం నుంచి బహిష్కరించకుండా నిలపాలని, మానవతా దృక్పథంతో వీసా మంజూరు చేయాలని ప్రజల మద్దతు కోరారు. ఈ పిటిషన్‌కు ఆస్ట్రేలియా ప్రజల నుంచి మద్దతు లభించింది. 7,000 మందికి పైగా సంతకాలు చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ‘మా పిల్లలు ఇక్కడే పెరుగుతున్నారు. ఇదే వారి ఇల్లు… మమ్మల్ని వెళ్లగొడితే మా బాబుకు భవిష్యత్తు ఉండదు’ అంటూ ఆ తల్లిదండ్రులు చేస్తున్న అభ్యర్థన నెటిజన్లను కదిలిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టెకీలకు గడ్డుకాలం.. కెనడా , యూరప్ వైపు చూపు

సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు

ర్యాట్‌ స్నాకింగ్‌… ఇదో వింత అలవాటు..! కానీ చాలా డేంజర్!

పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్‌ ఎందుకు చనిపోతుంది? నమ్మలేని నిజాలు..

‘ఫ్రెంచ్ సండే’ ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే

Follow Us