మధ్యాహ్నం వేళ నీరసంగా అనిపిస్తోందా.. ఇదిగో సరికొత్త ట్రిక్ ‘కాఫీ నాప్’
కాఫీ తాగిన వెంటనే 15–20 నిమిషాల పాటు కునుకు తీస్తే మెదడు మరింత చురుకుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ‘కాఫీ నాప్’గా పిలిచే ఈ పద్ధతిలో కెఫీన్ ప్రభావం, శరీరంలోని అడెనోసిన్ తగ్గుదల కలిసి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఉత్సాహాన్ని పెంచుతాయి. అయితే 20 నిమిషాలకు మించి నిద్రపోకూడదని, మధ్యాహ్నం 3 గంటలలోపే ఈ అలవాటు పాటించాలని సూచిస్తున్నారు.
పని ఒత్తిడితో బాగా అలసిపోయినప్పుడు ఒక కప్పు వేడి వేడి కాఫీ తాగితే ఎంతో రిలాక్స్‌గా అనిపిస్తుంది. అందుకే చాలామంది ఈవినింగ్ బ్రేక్‌లో తప్పనిసరిగా కాఫీ తాగుతారు. అయితే, కాఫీ తాగిన వెంటనే ఓ చిన్న కునుకు తీస్తే మెదడు రెట్టింపు వేగంతో పనిచేస్తుందని మీకు తెలుసా? దీనినే శాస్త్రీయంగా ‘కాఫీ నాప్’ అని పిలుస్తారు. వినడానికి వింతగా అనిపించినా, విపరీతమైన ఉత్పాదకతను ఇచ్చే ఈ సింపుల్ ట్రిక్ వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. మనం మెలకువగా ఉన్నప్పుడు మెదడులో ‘అడెనోసిన్’ అనే రసాయనం పేరుకుపోయి మనల్ని నిద్రమత్తులోకి నెట్టివేస్తుంది. సాధారణంగా కాఫీలోని కెఫీన్ మెదడులోకి చేరుకుని ఈ అడెనోసిన్ ప్రభావానికి అడ్డుకట్ట వేస్తుంది. అదే సమయంలో కాఫీ తాగిన వెంటనే ఒక 15-20 నిమిషాలు నిద్రపోతే, శరీరం ఆ అడెనోసిన్‌ను సహజంగా బయటకు పంపుతుంది. సరిగ్గా మీరు నిద్రలేచే సమయానికి కెఫీన్ రక్తంలో కలవడం, అప్పటికే అడెనోసిన్ ఖాళీ కావడం వల్ల కెఫీన్ రెట్టింపు ప్రభావంతో పనిచేస్తుంది. ఇది మీకు తక్షణ శక్తిని, అద్భుతమైన ఏకాగ్రతను అందిస్తుంది. ఈ కాఫీ నాప్ వల్ల సమాచారాన్ని గుర్తుంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. మధ్యాహ్న వేళల్లో వచ్చే నీరసాన్ని తగ్గించి, సాయంత్రం వరకు ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా లాంగ్ డ్రైవర్లు లేదా రాత్రిపూట షిఫ్టుల్లో పనిచేసే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే, ఈ కునుకు కేవలం 15 నుండి 20 నిమిషాలు మాత్రమే ఉండాలి. 30 నిమిషాలకు మించితే గాఢ నిద్రలోకి వెళ్లి తల భారంగా అనిపిస్తుంది. అలాగే దీనిని మధ్యాహ్నం 3 గంటల లోపే ప్రయత్నించాలి. రాత్రి వేళల్లో చేస్తే ప్రధాన నిద్ర పాడువుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇతను బస్సు డ్రైవరా.. కుబేరుడా!
మీ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ సురక్షితమేనా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
