ఇక రైల్వే స్టేషనే పోలీస్‌ స్టేషన్‌.. ఏపీలో కొత్త సేవలు!

Updated on: Oct 02, 2026 | 4:55 PM

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రజల కోసం డిజిటల్‌ ఈ-ఫిర్యాదుల కియాస్క్‌ అందుబాటులోకి వచ్చింది. ‘మీ పోలీస్‌.. మీ ఫ్రెండ్‌’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సదుపాయంలో తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో వాయిస్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మైక్‌ ముందు మాట్లాడితే వివరాలను ఫిర్యాదు రూపంలో నమోదు చేసేలా వ్యవస్థను రూపొందించారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ప్రజలకు పోలీసుల సహాయం అందించడమే దీని ఉద్దేశం. రైల్వే స్టేషన్‌లో ఈ సేవను హోంమంత్రి అనిత ప్రారంభించారు.

పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. రైల్వే స్టేషన్‌లోనే కంప్లైంట్.. ఎస్‌ మీరు విన్నది నిజం..విశాఖలో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది మీ పోలీస్.. మీ ఫ్రెండ్ అంటూ కొత్త కియాస్క్‌ యాప్‌ తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటీ యాప్‌..ఎలా పనిచేస్తుంది. అత్యవసర సమయాల్లో ఆపద్బాంధవుడు..! ఎస్ మీరు ఒక్కసారి పలికితే చాలు ఫిర్యాదు నమోదు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లే అవసరం లేకుండానే ఈ కియోస్క్ తో మాట్లాడితే ఫిర్యాదు చేసినట్టే..! నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ అవుట్ పోస్ట్ బస్టాండ్ లో డిజిటల్ కియాస్కులను ఏర్పాటు చేసింది సిటీ పోలీస్. ఇకపై ప్రతి చిన్న సమస్యకూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానంతో సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఏపీ పోలీస్ శాఖ మరో అడుగు ముందుకేసింది. విశాఖ రైల్వే స్టేషన్‌లో మీ పోలీస్.. మీ ఫ్రెండ్.. డిజిటల్ ఈ-ఫిర్యాదుల కియాస్క్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమాన్ని హోం మంత్రి అనిత ప్రారంభించారు. విశాఖ రైల్వే స్టేషన్‌కు ప్రతిరోజూ సుమారు లక్షన్నర మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇంత భారీ సంఖ్యలో ప్రయాణికులు వచ్చే ప్రాంతంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు హోం మంత్రి అనిత. ఫిర్యాదులపై తక్షణ స్పందన..బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చూసేందుకు ఈ కియాస్క్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు హోం మంత్రి. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కియాస్క్‌లో తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో వాయిస్ ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యాన్ని కల్పించారు. మైక్‌ ముందు కూర్చుని తమకు వచ్చిన బాషలో మాట్లాడితే..దాన్ని ఫిర్యాదు రూపంలో తయారు చేస్తుందన్నారు అనిత. ఉన్నచోట నుంచే సులభంగా పోలీసుల సహాయం పొందడం ఈ యాప్‌ ద్వారా చాలా సులభం అన్నారు సీపీ శంకభ్రత బాగ్చి. ఫిర్యాదు చేయడం కోసం ఈ క్రియాస్క్‌లు అద్భుత అస్త్రంగా పనిచేస్తాయన్నారు. దేశంలోనే తొలిసారిగా ఇటువంటి సేవలు ఉన్న నగరాల్లో విశాఖ ఒకటన్నారు సీపీ. విశాఖకు ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా.. ఎటువంటి ఆపద వచ్చినా… పోలీసులకు సంప్రదించాలి అనుకుంటే ఈజీగా కేవలం సమస్య చెబుతాయో చాలు..మేమున్నామంటున్నారు విశాఖ కాప్స్‌. కేవలం తన దగ్గర నిలుసుని మిషన్ చెప్పిన వాడిని ఫాలో అవుతూ మీరు సమస్య చెబితే చాలు మేమే సేవలందిస్తాం అంటున్నారు. సో.. విశాఖలో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ సక్సెస్ అయితే ఇక మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..? థియేటర్‌కు దిమ్మతిరిగే షాక్..

Baldness: బట్టతల చుట్టూ బోలెడు బిజినెస్! ఇది యాపారం భయ్యా!

Loading...
Unable to load recommendations.
Follow Us