గిన్నిస్ రికార్డు సృష్టించిన భారీ పాము: చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే
ఇండోనేషియాలోని సులావేసి దీవిలో ప్రపంచంలోనే అతిపెద్ద రెటిక్యులేటెడ్ పైథాన్‌ను గుర్తించారు. 23 అడుగుల పొడవు, 96 కిలోల బరువున్న ఈ భారీ సర్పం గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఇది విషరహితమైనప్పటికీ, తన కండరాలతో ఎరను చుట్టేసి చంపేస్తుంది. అడవులు, నదుల వద్ద నివసించే ఈ పైథాన్ నీటిలో ఈదగలదు, చెట్లనూ ఎక్కగలదు. దాని సంతానోత్పత్తి వివరాలు ఆసక్తికరం.
ఇండోనేషియా లో ని అడవుల్లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాము ను స్థానికులు గుర్తించారు. సులావేసి దీవిలో కనుగొన్న ఓ ‘రిటిక్యులేటెడ్ పైథాన్’ తన భారీ కాయంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. సుమారు 23 అడుగుల పొడవు, 96 కిలోల బరువు ఉన్న ఈ భారీ సర్పాన్ని చూసి స్థానికులు విస్తుపోయారు. దీని శరీరంపై వలలాంటి ఆకృతులు ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇది విషరహిత పాము అయినప్పటికీ, తన బలమైన కండరాలతో ఎరను చుట్టేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తుంది. రాత్రివేళల్లో అత్యంత చురుగ్గా ఉండే ఈ పాములు అడవులు, నదులు మరియు చెరువుల వద్ద నివసిస్తాయి. నీటిలో వేగంగా ఈద గలగటంతో పాటు చెట్టనుకూడా ఈజీగా ఎక్కేస్తుంది ఈ పైథాన్. ఇందులో ఆడ పైథాన్ 20 నుంచి 80 వరకూ గుడ్లు పెడుతుంది. వాటిని తన శరీరంతో చుట్టుకుని వేడిని ఇవ్వటం ద్వారా పొదుగుతుంది. అలా 80 నుంచి 90 రోజుల్లో ఆ గుడ్లనుంచి పిల్లలు బయటకు వస్తాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీళ్లా.. అని లైట్ తీసుకోకండి.. విషయం తెలిస్తే షాకే
అదృష్టం, ఆనందం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి
అనకాపల్లి అగ్నిప్రమాదం: గూడ్స్ రోడ్డులో మహిళా సజీవ దహనం
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిల్ గేట్స్: ఉండవల్లిలో అరటి తోటల పరిశీలన
రంగారెడ్డి రోడ్డు ప్రమాదం: హైదరాబాద్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన కారు
