మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్
నాసిక్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగుల లైంగిక వేధింపులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. టీమ్ లీడర్‌తో సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు. తొమ్మిది కేసులు నమోదవ్వడంతో సిట్ ఏర్పాటు చేసి, అండర్‌కవర్ ఆపరేషన్‌తో నిందితులను పట్టుకున్నారు. మహిళా ఉద్యోగులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
నాసిక్‌లోని ఓ ఐటీ కంపెనీకి చెందిన టీమ్ లీడర్ సహా ఆరుగురిని లైంగిక వేధింపుల ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేసారు. తొమ్మిది కేసులు నమోదు కావడంతో కేసుల దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఏడుగురు మహిళా పోలీసుల్ని ఐటీ కంపెనీకి అండర్‌కవర్‌గా పంపి నిందితులను రెడ్ డెడ్‌గా పట్టుకున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా తమను లైంగికంగా వేధిస్తున్నారని మహిళా ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఒక టెకీ నైతేపెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడు టీమ్ లీడర్. ఆ తర్వాత పలుసార్లు ఆమెపై అత్యాచారం చేసాడు. మిగిలిన ఐదుగురు మహిళా సహోద్యోగులను లైంగిక వేధింపులకు గురిచేయడం, మతం పేరుతో వారిని కించపరచడం వంటివి చేసినట్టు పోలీసులు తెలిపారు. నాసిక్‌లోని ఆ ఐటీ కంపెనీలో దాదాపు 300 మంది ఉద్యోగులు ఉన్నారు. లైంగిక నేరాలు, మతపరమైన మనోభావాలను దెబ్బతీసినట్లు మహిళా సహోద్యోగులు మొత్తం తొమ్మిది కేసులు పెట్టారు. హెచ్‌ఆర్ అధికారి కూడా అనుమానితుడినేనని నాసిక్ ఏసీపీ సందీప్ మిట్కే అన్నారు. టీమ్ లీడర్లు ఆఫీసులో వేధిస్తున్నాడని మహిళా బాధితులు అతడికి మెయిల్ పంపితే.. ‘మల్టినేషనల్ కంపెనీలలో ఇలాంటివి సర్వసాధారణం అని అన్నాడనీ ఆ హెచ్‌ఆర్‌ను ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఏసీపీ తెలిపారు. అత్యాచారం కేసులో బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి బలవంతంగా శారీరక సంబంధ పెట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు తనపై పలుసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. అతని సహచరుడు కూడా ఆఫీసు లాబీ ఇంకా ప్యాంట్రీలో తనను లైంగికంగా వేధించడం ప్రారంభించాడని బాధితురాలు వాపోయింది. పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలు నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలనీ నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్ అన్నారు. మొత్తం తొమ్మిది కేసుల్లో మొదట మార్చి 26న అత్యాచారం ఫిర్యాదు దేవ్‌లలీ పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యిందని, మిగతా ఎనిమిది కేసులు ముంబయి నకా పోలీస్ స్టేషన్‌లో వేర్వేరు సమయాల్లో నమోదయినట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్త నల్లగా ఉన్నాడని భార్య దారుణం.. ఆస్కార్ లెవెల్ యాక్టింగ్‌తో డ్రామా
Aditya Dhar: ప్రభాస్ లెజెండ్ అంటూ.. ధురంధర్ డైరెక్టర్ క్రేజీ కామెంట్స్
