Work From Home Effect: వర్క్‌ ఫ్రం హోమ్‌ ఎఫెక్ట్‌.. పాపం ఈ వరుడికి ఎన్ని కష్టాలో..! నవ్వలేక పండితుడు..

|

Dec 04, 2022 | 9:35 AM

కరోనా మహమ్మారి ప్రభావంతో అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్ర్‌ ఫ్రం హోమ్‌ అవకాశాన్ని కల్పించాయి. ఇటీవల కరోనా ప్రభావం తగ్గడంతో తిరిగి అందరినీ కార్యాలయాలకు ఆహ్వానించింది.


వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ యువకుడి వివాహం జరుగుతోంది. ఓ వైపు వేద పండితుడు మంత్రాలు చదువుతూ పెళ్లి తంతు జరిపిస్తున్నాడు. మరోవైపు పెళ్లి కొడుకు మాత్రం ల్యాప్‌ట్యాప్‌లో వర్క్‌ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. పెండ్లి మండ‌పంలోనూ ల్యాప్‌టాప్‌తో వరుడు కుస్తీ ప‌డుతున్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటోను ఓ యూజర్‌ ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేస్తూ.. వ‌ర్క్ ఫ్రం హోం నెక్ట్స్ లెవెల్ ఇదేనంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ సంఘటన కోల్‌కతాలో జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వేలమంది వీక్షిస్తూ లైక్‌ చేస్తున్నారు. అంతేకాలు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఊపిరిస‌ల‌ప‌ని వ‌ర్క్ క‌ల్చర్‌ను ప్రోత్సహించ‌వ‌ద్దని ఓ యూజ‌ర్ కామెంట్ చేయ‌గా, ఇదే నిజ‌మైతే పెండ్లికొడుకు వ‌ర్క్‌-లైఫ్ బ్యాలెన్స్‌ను నేర్చుకోవాల‌ని, ఇలా పెళ్లిరోజు కూడా ప‌నిచేయాల‌ని ఏ కంపెనీ ఉద్యోగిని కోర‌ద‌ని మ‌రో యూజ‌ర్ రాసుకొచ్చారు. ఇత‌డు పెళ్లాడే యువతిని దేవుడు ఆశీర్వదించాల‌ంటూ మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Follow us on