ఇదేమి విచిత్రం !! బార్‌ ముందు యువకుడిని కొట్టిన యువతి

|

Jul 27, 2022 | 9:10 PM

ఉత్తర ప్రదేశ్‌లోని సమ్మిట్ బిల్డింగ్‌లో ఉన్న ఓ బార్ బయట యువకుడిపై యువతి దాడి చేసింది. అతడిని కొడుతూ రచ్చ చేసింది. ఆ అమ్మాయితో ఉన్న మరో యువతి ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె ఆగలేదు.

ఉత్తర ప్రదేశ్‌లోని సమ్మిట్ బిల్డింగ్‌లో ఉన్న ఓ బార్ బయట యువకుడిపై యువతి దాడి చేసింది. అతడిని కొడుతూ రచ్చ చేసింది. ఆ అమ్మాయితో ఉన్న మరో యువతి ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె ఆగలేదు. పక్కనే ఉన్న పూల కుండిలను ఆ యువకుడిపైకి విసురుతూ దాడి చేసింది. బార్ బయటే ఉన్న బౌన్సర్స్ వెంటనే వచ్చి ఆ అమ్మాయిని ఆపి.. ఆ యువకుడిని పక్కనే ఉన్న మరో రూంలోకి పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు పోలీసులు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ యువతి, యువకుడు కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే బార్‌లోని బౌన్సర్లను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అయితే ఇలా ఎందుకు కొట్టిందన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: పిల్లాడిని ముట్టుకుంటే ఖబర్దార్‌.. అంటున్న పెంపుడు కుక్క

Published on: Jul 27, 2022 09:10 PM