‘ఫ్రెంచ్ సండే’ ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే

Updated on: May 25, 2026 | 4:31 PM

వారాంతం వచ్చినా పనుల ఒత్తిడితో అలసిపోయే వారికి ‘ఫ్రెంచ్ సండే’ ఒక కొత్త రిలాక్సింగ్ ట్రెండ్‌గా మారుతోంది. ఫ్రాన్స్‌లో ప్రాచుర్యంలో ఉన్న ఈ సంప్రదాయం ఆదివారం రోజును ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా గడపాలని సూచిస్తుంది. మొబైల్, పనులు, హడావిడికి దూరంగా ఉండి మనసుకు నచ్చిన పనులతో సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతత పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా మనకు ఆదివారం ఎలా గడుస్తుంది? వారమంతా పేరుకుపోయిన బట్టలు ఉతకడం, ఇంట్లో మూలమూలలా పేరుకున్న దుమ్ము దులపడం, బంధువులు, స్నేహితులతో మాట్లాడటం.. ఇలాంటి కుటుంబ, వ్యక్తిగత బాధ్యతలతోనే సరిపోతుంది. దీంతో విశ్రాంతి కోసం ఎదురుచూసే ఆ ఒక్కరోజు కూడా మిగతా పనిదినాల్లాగే మరింత అలసటను మిగులుస్తుంది. మనకంటూ మనం కేటాయించుకున్న సమయం కాస్తా ఆవిరైపోతుంది. ఈ సమస్యకు ఫ్రెంచ్ ప్రజల దగ్గర ఒక చక్కటి పరిష్కారం ఉంది. దాని పేరే ‘ఫ్రెంచ్ సండే’. ఆ రోజు ఏ పనీ చేయకుండా ప్రశాంతంగా, హాయిగా గడపడమే దీని ఉద్దేశం. ఫ్రాన్స్‌లో ఇది ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయం అయినప్పటికీ, ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతోంది. ఫ్రాన్స్‌లో నివసిస్తున్న కొందరు విదేశీయులు తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఈ ట్రెండ్‌ను మరింత ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ‘ఏ పనీ చేయకుండా ఉండే కళ’.దీనినే ఫ్రెంచ్‌ సండే అనొచ్చు. చాలామంది తమ సెలవు రోజున కూడా ఏదో ఒక పని పూర్తి చేయాలని ఒత్తిడికి గురవుతుంటే, ఫ్రాన్స్‌లో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం ఉంటుంది. అక్కడ ఆదివారం దుకాణాలు కూడా మూసి ఉంటాయి. అంటే, కనీసం కిరాణా సామాను కొనడానికి కూడా అది సరైన రోజు కాదని వారి నమ్మకం. ఆ రోజున మనసు, శరీరంపై మాత్రమే దృష్టి పెట్టాలి. నచ్చినప్పుడు నిద్రలేవాలి. వేడివేడి కాఫీ తాగుతూనో, ఇష్టమైన పుస్తకం చదువుతూనో సమయం గడపాలి. ఉదయం నెమ్మదిగా మధ్యాహ్నంలోకి జారుకోగానే, ఏ హడావిడీ లేకుండా నెమ్మదిగా భోజనం చేస్తూ కబుర్లలో మునిగిపోవాలి. ‘ఫ్రెంచ్ సండే’ను మీరున్న చోటే ప్రయత్నించవచ్చు. ప్రతి నిమిషాన్ని ఉత్పాదకంగా మార్చుకోవాలనే ఒత్తిడిని పక్కన పెట్టండి. ఆ రోజున మీ శరీరం ఏం చెబితే అది వినాలి. మధ్యాహ్నం వరకు నిద్రపోయినా, మళ్లీ భోజనం తర్వాత మళ్లీ కాసేపు కునుకు తీయాలనిపిస్తే హాయిగా ఆ పని చేయండి. నచ్చిన పుస్తకం, సంగీతం, లేదా మీకు నచ్చిన మరేదైనా వ్యాపకంతో సమయం గడపండి. ముఖ్యంగా మీ డివైజ్‌లను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఫ్లానర్’ అనే ఫ్రెంచ్ పదాన్ని ఆచరణలో పెట్టండి. అంటే, ఎలాంటి గమ్యం లేకుండా నెమ్మదిగా నడకకు వెళ్లడం. ఆ రోజు ఏమీ చేయలేదని ఆలోచించకుండా, మనసునులోని ఆలోచనలను స్వేచ్ఛగా వదిలేయడం అన్నమాట. అయితే, దీని అర్థం స్నేహితులను కలవకూడదని, ఇంటి పనులు చేయకూడదని కాదు. ఆ పనులు మీకు ఆనందాన్ని ఇస్తాయనుకుంటే, అవి మీకు భారంగా అనిపించకపోతే మాత్రమే చేయాలి. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం మనతో మనం, మన సన్నిహితులతో నాణ్యమైన సమయాన్ని గడపడం. అది మన జీవితాన్ని మార్చే మంత్రదండం కాకపోవచ్చు. ఫ్రెంచ్ సండేని ఎంజాయ్ చేసినంత మాత్రాన.. మర్నాడు సోమవారం రాకుండా ఏమీ ఆగదు కానీ, రోజురోజుకీ పెరుగుతున్న పని ఒత్తిడి, బర్న్‌అవుట్ లాంటి సమస్యల మధ్య, ‘ఫ్రెంచ్ సండే’ మనకు ఒక చిన్న విరామాన్ని ఇస్తుంది. జీవితాన్ని కాస్త నెమ్మదిగా, మరింత మానవీయంగా ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అద్భుతాన్ని కనిపెట్టి.. సీక్రెట్‌ మెయిన్‌టైన్ చేసిన ఇస్రో!

కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా

Follow Us