zelenskyy trolles: జెలెన్‌స్కీ ఫొటోషూట్‌ను ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు.. దేశం రగిలిపోతుంటే అవసరమా..?

Updated on: Aug 08, 2022 | 10:10 PM

ప్రఖ్యాత వోగ్‌ మేగజీన్‌ పత్రికకు భార్య ఒలేనాతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. యుద్ధ పరిస్థితులకు అద్దం పట్టేలా సైనికులు, యుద్ధ ట్యాంక్‌లు, ధ్వంసమైన విమానాలతోనూ


ప్రఖ్యాత వోగ్‌ మేగజీన్‌ పత్రికకు భార్య ఒలేనాతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. యుద్ధ పరిస్థితులకు అద్దం పట్టేలా సైనికులు, యుద్ధ ట్యాంక్‌లు, ధ్వంసమైన విమానాలతోనూ ఒలేనా మరికొన్ని ఫొటోలు దిగారు. అయితే, రష్యాతో యుద్ధంతో దేశం రావణకాష్టంగా రగిలిపోతుంటే ఇవేమీ పట్టనట్టు సతీమణితో మేగజైన్‌లకు పోజులిస్తున్నాడని జెలెన్‌స్కీపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. జెలెన్‌స్కీ దంపతుల చర్యను సమర్థిస్తూ కూడా చాలా మంది నెటిజన్లు పోస్టులు పెట్టారు.ప్రత్యేక కవర్‌ స్టోరీలో జెలెన్‍స్కా, ఆమె భర్త, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీలు యుద్ధ సమయంలో వారి జీవితం గురించి చెప్పారని పేర్కొంది వోగ్‌ మ్యాగజైన్‌. వారి వివాహం, చరిత్ర, ఉక్రెయిన్‌ భవిష్యత్తు కోసం చేయాలనుకుంటున్న పనులు వంటివి వివరించినట్లు పేర్కొంది. అయితే.. పెద్ద సంఖ్యలో నెటిజన్లు ఈ ఫోటోలను ట్రోల్‌ చేశారు. ఒక యాక్టర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే యుద్ధం సమయంలో వారి ప్రాధాన్యత ఇలానే ఉంటుంది అని ఓ నెటిజన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 08, 2022 10:10 PM
Loading...
Unable to load recommendations.
Follow Us