Devil Tree: విశాఖలో దెయ్యం చెట్టు.. హడలిపోతున్న జనాలు.. అసలు మ్యాటర్ ఏంటంటే.. వీడియో

|

Oct 17, 2021 | 9:52 AM

సాగర తీరం విశాఖ నగరంలో ఓ పచ్చటి చెట్టు స్థానికుల్ని హడలెత్తిస్తోంది... ఏడాది పొడవునా కొమ్మలు, రెమ్మెలతో కళలాడుతూ కనిపిస్తూ.. సీజన్లో తెల్లటి పువ్వులతో ఆకర్షిస్తుంది. ఇప్పుడు అదే చెట్టు వైజాగ్ వాసులను వణికిస్తుంది.

సాగర తీరం విశాఖ నగరంలో ఓ పచ్చటి చెట్టు స్థానికుల్ని హడలెత్తిస్తోంది… ఏడాది పొడవునా కొమ్మలు, రెమ్మెలతో కళలాడుతూ కనిపిస్తూ.. సీజన్లో తెల్లటి పువ్వులతో ఆకర్షిస్తుంది. ఇప్పుడు అదే చెట్టు వైజాగ్ వాసులను వణికిస్తుంది. ఆల్ స్టోనీయా స్కోలరీస్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ రకం మొక్క అతి తక్కువ సమయంలో ఏపుగా పెరుగుతూ నిత్యం పచ్చగా ఉంటాయి. భూమి నుంచి తక్కువ నీటిని తీసుకుంటుంది. కానీ, ఈ చెట్ల పొదల నుంచి వెదజల్లే పుప్పుడు వల్ల మనుషుల్లో వికారం, తలనొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయంటున్నారు వృక్ష శాస్త్ర నిపుణులు, పర్యావరణవేత్తలు. ఆ పూల వాసనకు ఆస్తమా వంటి శ్వాససంబంధమైన వ్యాదులు ఉన్న వారికి మరింత ఎక్కువవుతుందని చెప్తున్నారు. శీతాకాలం ప్రారంభంలో ఈ చెట్టు పూతకు వస్తుంది. సెప్టెంబర్ ఎండింగ్ నుంచి నవంబర్ మధ్య ఎక్కువగా పూస్తుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వామ్మో.. రణ ధ్వని.. నిమిషం పాటు కూతపెడుతున్న కోడిపుంజు.. వీడియో

Viral video: ప‌చ్చి మాంస‌మే అత‌డి లంచ్‌, డిన్నర్‌.. మూడేళ్ళుగా అదే ఆహారం.. వీడియో

Follow us on