Viral video : వేటాడాల్సిన ఆ చిరుత జింకను ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. ఎవ్వరు ఊహించని వీడియో

Viral video : ఆకలిగా ఉన్న చిరుతకు జింక చిక్కితే వదులుతుందా.. ఒక్క పంజాతో దాన్ని చంపి ఆరగిస్తుంది. అప్పుడే ప్రసవించిన ఓ జింక పిల్లను తల్లి జింక దానిని నాలికతో...

Viral video : వేటాడాల్సిన ఆ చిరుత జింకను ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. ఎవ్వరు ఊహించని వీడియో

Edited By:

Updated on: Feb 21, 2021 | 9:00 PM

Viral video : ఆకలిగా ఉన్న చిరుతకు జింక చిక్కితే వదులుతుందా.. ఒక్క పంజాతో దాన్ని చంపి ఆరగిస్తుంది. అప్పుడే ప్రసవించిన ఓ జింక పిల్లను తల్లి జింక దానిని నాలికతో శుభ్రం చేసుకుంటూ సంతోషంగా దగ్గరకు చేర్చుకుంటుండగా, అంతలోనే ఓ చిరుత చూసి పరుగున జింక దగ్గరకొచ్చింది. ఇంకేముందు చిరుతను చూసిన తల్లి జింక వెంటనే పారిపోయింది. ఇక చిరుత ఏం చేస్తుంది వెంటనే పిల్ల జింకను ఆరగించేందుకు ప్రయత్నించింది. కొద్ది సేపు చిరుత అటు ఇటుగా చూస్తే చివరికి జింక పిల్లను నోట కర్చుకుని వేలాడదీస్తూ ఓ చెట్టు వద్దకెళ్లింది. చిరుత జింక పిల్ల తలనో నోట్లో పెట్టుకుని పొదల చాటున వెళ్తుండగానే ఆ పిల్ల చనిపోయింది. ముందుగా వీడియోలో చూస్తున్నట్లు పిల్ల జింకను ఏమి చేయకుండా కాపాడుతుందని అనుకునే లోపే జింక పిల్లను నోట కర్చుకుని ప్రాణాలు తీసింది. పాపం అప్పుడే పుట్టిన జింకకు వందేళ్లు నిండినట్లయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు జింక పిల్లను చంపబోదేమోనని అనుకున్నారు. కాని చివరికి చిరుత పిల్ల జింక తలను నోట్లో పెట్టుకుని చంపేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us