పొద్దున్నే తలుపు తీయగానే.. గుండెలు బద్దలయ్యే సీన్
వర్షాకాలంలో జనావాసాల్లోకి పురుగూ పుట్రా చొచ్చుకుని వస్తుంటాయి. సాధారణంగా వరద సమయంలో పెద్ద పెద్ద పాములు కూడా నివాస ప్రాంతాల్లో కనిపించి జనాల్ని బెంబేలెత్తిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉదయాన్నే తలుపు తీసిన యజమానికి వాకిలి ముందు.. బుసలు కొడుతున్న పెద్ద నాగుపాము కనిపించింది.
దీంతో, ఆయన భయంతో వణికిపోతూ.. సాయం కోసం అరిచి కేకలు వేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలోని చాప్రౌలి పట్టణంలో ఓ ఇంటి యజమాని రోజూ మాదిరిగానే లేచి, మార్నింగ్ వాక్ కోసమని తలుపు తీశాడు. ఆయన బయట అడుగు వేద్దామనుకునే లోపే.. వాకిలి ముందు కనిపించిన పెద్ద నాగుపామును చూసి.. ఒక్కసారి షాకయ్యాడు. తలుపు తీసి, తన దిశగా వస్తున్న వ్యక్తిని చూసిన పాము.. ఒక్కసారిగా అడుగున్నర ఎత్తున లేచి, బుసలు ఇంటిలోకి దూరటంతో ఇంటి యజమాని భయంతో వణికిపోతూనే, పెద్దగా అరిచి కేకలు వేశాడు. దీంతో, ఇంట్లో వాళ్లంతా నిద్ర లేచి బయటికి వచ్చి, ఆ పామును చూసి షాకయ్యారు. ఒక్క క్షణం తర్వాత తేరుకున్న ఇంటి యజమాని, నెమ్మదిగా ఇంట్లోని వాళ్లందరినీ బయటికి తీసుకుపోయి, స్నేక్ క్యాచర్ కి సమాచారం ఇవ్వటంతో వాళ్లు వచ్చి దానిని బంధించారు. ఈ లోపు ఇరుగుపొరుగు వారు అక్కడ పోగవటం, అక్కడి యువకులు ఈ సీన్ అంతటినీ వీడియో తీసి వైరల్ చేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు సైతం షాకవుతూ.. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫేక్ రివ్యూ ఎఫెక్ట్ పోలీస్ స్టేషన్‌కు పూల చొక్కా…
రూ. 7 కోట్లతో తీస్తే.. 90 కోట్ల కలెక్షన్స్.. ఛావా రికార్డ్ బ్రేక్