స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. స్కూల్‌ను సీజ్ చేసిన అధికారులు
ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఓ పాఠశాలలో విద్యార్థినులతో బురఖా ధరింపజేసి సినిమా పాటలకు నృత్యాలు చేయించిన ఘటన వివాదాస్పదమైంది. వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే పాఠశాలను నిర్వహిస్తున్నట్లు తేలడంతో అధికారులు స్కూల్‌ను సీజ్ చేశారు. అక్కడి విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలగకుండా సమీపంలోని గుర్తింపు పొందిన పాఠశాలల్లో చేర్పించినట్లు అధికారులు తెలిపారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. గోండా జిల్లాలోని బాబాన్‌జోత్ ప్రాంతంలో ఓ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున కొందరు విద్యార్థినులతో బురఖా ధరింపజేసి సినిమా పాటలకు డ్యాన్స్ చేయించారు. హిందూ అమ్మాయిలకు బురఖా వేసి నృత్యాలు చేయించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. స్థానిక విద్యాశాఖ అధికారి అమిత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రియాజ్ అహ్మద్ ఆ పాఠశాలలో తనిఖీలు చేపట్టారు. విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఆ పాఠశాలను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. వాస్తవానికి ఆ పాఠశాల నిర్వహణను నిలిపివేయాలని అధికారులు వారం క్రితమే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ యాజమాన్యం స్కూల్‌ను యథావిధిగా కొనసాగించింది. దీంతో ఆగ్రహించిన అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. స్కూల్ మేనేజర్ కార్యాలయంతో పాటు ప్రిన్సిపాల్ రూమ్‌కు తాళాలు వేసి, పాఠశాల ప్రధాన గేటును సీజ్ చేశారు. ఈ మొత్తం ఘటనపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు పూర్తి నివేదిక అందజేశారు. మరోవైపు విద్యార్థుల చదువుకు ఎలాంటి భంగం కలగకుండా, ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరినీ సమీపంలోని ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన ఇతర పాఠశాలల్లో చేర్పించినట్లు అధికారులు వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వెన్నులో వణుకే!
యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు.. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం!
LPG: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!
లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త! బ్యాంకుల ఇష్టారాజ్యానికి చెక్!
