Viral Video: ఇంట్లో పెత్తనం చెలాయించాలంటే ఇక్కడ నెగ్గాల్సిందే.. పంతులు పెట్టిన పోటీలో విజయం ఎవరిదంటే? వైరల్ వీడియో

|

Jan 06, 2022 | 12:58 PM

Trending Video: వైరల్ అవుతున్న వీడియోలో, పెళ్లి మండపంపై వధూవరులు కూర్చున్నట్లు మీరు చూడవచ్చు. అయ్యగారు పెళ్లి తంతు పూర్తవ్వడంతో వధూవరులను సరదాగా ఆట ఆడమని అడుగుతాడు.

Viral Video: ఇంట్లో పెత్తనం చెలాయించాలంటే ఇక్కడ నెగ్గాల్సిందే.. పంతులు పెట్టిన పోటీలో విజయం ఎవరిదంటే? వైరల్ వీడియో
Viral Video
Follow us on

Viral Video: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పెళ్లి వీడియోల సందడి ఎక్కువగా ఉంటోంది. భారతీయ వివాహాలకు సంబంధించిన ఫన్నీ వీడియోలతోపాటు హృదయాన్ని హత్తుకునే వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల ఆధిపత్యం కూడా కనిపిస్తోంది. తాజాగా పెళ్లికి సంబంధించిన ఓ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చూసి మీరు కూడా వావ్ అంటారు.

భారతీయ వివాహాలు చాలా ఎక్కువ సేపు జరుగుతుంటాయి. ఇందులో వివిధ ఆచారాలు, వేడుకలను పూర్తి చేయడానికి గంటల సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో, అక్కడ ఉన్న బంధువులు విసుగు చెందకుండా, చాలా మంది జంటలు ఫన్నీగా ఏదో ఒకటి చేస్తూ నెట్టింట్లో వైరల్‌గా మారుతంటారు. ఇటీవలి కాలంలో, వారి పండిట్ కోరిక మేరకు పెళ్లి వేడుకల్లో వధూవరులు సరదాగా గేమ్ ఆడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో, పెళ్లి మండపంపై వధూవరులు కూర్చున్నట్లు మీరు చూడవచ్చు. అయ్యగారు పెళ్లి తంతు పూర్తవ్వడంతో వధూవరులను సరదాగా ఆట ఆడమని అడుగుతాడు. ఆట నియమాలను కూడా తెలిపాడు. ఎవరు ముందుగా కుర్చీలో కూర్చుంటారో వారి వద్ద ఇంటి తాళం ఉంటుందంటూ పోటీ పెడతాడు. అయ్యగారు చేతులు దించగానే, ఇద్దరూ త్వరగా కుర్చీలో కూర్చున్నట్లు వీడియోలో చూడొచ్చు.

ఆట మొదలయ్యాక ఇద్దరూ త్వరగా కుర్చీలో కూర్చున్నన్నట్లు బంధువులకు చెబుంతుంటారు. అయితే వీడియోను జాగ్రత్తగా చూస్తే మాత్రం, వధువు గెలిచినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం, ఈ వీడియో ఎక్కడిది అనేది తెలియదు, అయితే ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అవుతోంది. ఈ వీడియో witty_wedding అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అప్‌లోడ్ అయింది. ఇప్పటి వరకు ఈ వీడియో 10 వేలకు పైగా లైకులతో దూసుకపోతోంది.

Also Read: Viral Video: ఇదేందిది.! ఈ వ్యక్తి క్రియేటివిటీకి ఇంజినీర్లు సైతం షాకవుతారు.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

10. 11సార్లు కరోనా టీకా వేసుకున్నానోచ్‌!(Video)