శివాలయంలో అద్భుత దృశ్యం..శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మనుబోలు సమీపంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో మూడు నాగుపాములు కనిపించడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. గర్భగుడిలోకి ప్రవేశించిన పాములు శివలింగం చుట్టూ తిరిగిన అనంతరం సమీపంలోని పుట్టలోకి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు శివనామస్మరణ చేశారు. గతంలో కూడా ఇదే ఆలయంలో రెండు నాగుపాములు శివలింగం చుట్టూ తిరిగిన ఘటన జరిగిందని స్థానికులు గుర్తుచేశారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆశ్చర్యం కలిగించే అరుదైన ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తూ నాగభూషణుడు, ముక్కంటికి అత్యంత ప్రీతిపాత్రమైన నాగుపాములు స్వయంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాయా అన్నట్లుగా అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మనుబోలు బీసీ కాలనీ సమీపంలోని రైల్వేగేట్ వద్ద ఉన్న శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ వింత ఘటన వెలుగుచూసింది. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించిన మూడు నాగుపాములు, పవిత్ర శివలింగం చుట్టూ ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేశాయి. పరమేశ్వరుడి సన్నిధిలో ఆ మూడు నాగుపాములు ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా, నిశ్చలంగా శివలింగం చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసుకుని, ఆ తర్వాత సమీపంలోనే ఉన్న పుట్టలోకి ప్రశాంతంగా వెళ్ళిపోయాయి. ఈ వింతను ప్రత్యక్షంగా చూసిన ఆలయ సిబ్బంది, స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇదంతా శివయ్య మహిమేనంటూ భక్తులు ‘హర హర మహాదేవ’, ‘శంభో శంకరా’ అంటూ శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ వార్త క్షణాల్లో సమీప ప్రాంతాలకు వ్యాపించడంతో, ఈ ఆధ్యాత్మిక అద్భుతాన్ని తిలకించేందుకు, దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. గతంలో కూడా సరిగ్గా ఇదే రీతిలో రెండు నాగుపాములు శ్రీకాశీ విశ్వనాథ స్వామి శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లు స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. స్వామివారి కృప, నాగేంద్రుల పవిత్ర సాన్నిధ్యం వల్ల తమ ప్రాంతానికి శుభం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rakul Preet Singh: మీరు అనుకుంటున్నట్టు నాకు ఎవరూ గిఫ్ట్‌లు.. విల్లాలు ఇవ్వలేదు!
Janhvi Kapoor: ఆ నీచులు చేసింది లైగిక వేధింపులకు తక్కువేం కాదు
Srikanth Odela: సుకుమార్ ఇంటి చుట్టూ మూడేళ్లు పిచ్చోడిలా తిరిగా..
పవన్‌తో సింగీతం ‘జీసెస్’ సినిమా చేద్దామనుకున్నారట.. ఆ సినిమా ఎందుకు ఆగిపోయిదంటే
