ఓరి మీ కక్కుర్తి కూలా.. ఇదేం పనిరా సామీ!

Updated on: Jul 29, 2026 | 9:38 PM

మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం వెలిగొండ ప్రాజెక్ట్ సుంకేసుల పునరావాస కేంద్రంలో దొంగలు 17 విద్యుత్ స్తంభాల వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్లారు. ప్రభుత్వ భవనాలను కూడా ధ్వంసం చేస్తూ అరాచకం సృష్టించారు. మరోవైపు వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి తీగల చోరీలు పెరగడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రతను పెంచి దొంగలను పట్టుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

చోరీకి కాదేదీ అనర్హం అన్నట్టుగా దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, దుకాణాల్లో చోరీ చేసే దొంగలు ఇప్పుడు రూటు మార్చారు. పంటపొలాలు, ప్రభుత్వ ప్రాపర్టీపై పడ్డారు. మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి సమీపంలోని వెలిగొండ ప్రాజెక్ట్ సుంకేసుల పునరావాస కేంద్రంలో దొంగలు ఏం చేశారో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఆ ప్రాంతంలో జనసంచారం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని రాత్రివేళల్లో ఏకంగా 17 విద్యుత్ స్తంభాలకు చెందిన విలువైన వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగుకుండా, అక్కడ నిర్మించిన ప్రభుత్వ భవనాల తలుపులను సైతం ధ్వంసం చేస్తూ దుండగులు తీవ్ర అరాచకం సృష్టిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల పెద్దారవీడు మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి ఖరీదైన రాగి తీగలను దోచుకెళ్తున్న ముఠాల సంఖ్య పెరుగుతోంది. పంటలకు సాగునీరందించే సమయంలో కరెంట్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల గస్తీ లోపించడం వల్లే దొంగలు ఈ స్థాయిలో విరుచుకుపడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఆ ప్రాంతంలో భద్రతను పెంచి, వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులను పట్టుకోవాలని రైతులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్

గుడ్‌న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఎల్పీజీ సిలిండర్ డెలివరీ!

అంతరిక్షంలో మెరిసిన తొలి భారత వజ్రం.. విక్రమ్-1తో స్కైరూట్ చరిత్ర!

భోగాపురంలో అదిరిపోయేలా ఏర్పాట్లు.. రేయింబవళ్లు కష్టపడుతున్న యంత్రాంగం

Elon Musk: ఎలాన్ మస్క్‌ మరో సూపర్‌ ప్లాన్‌.. X Moneyతో యాప్‌లోనే పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు!

Loading...
Unable to load recommendations.
Follow Us