Brother Harassment: సొంత సోదరిపై అన్న లైంగిక వేధింపులు.. 8 ఏళ్లుగా నీచానికి ఒడిగడుతూ బెదిరింపులు..

|

Sep 29, 2022 | 8:19 PM

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన ఓ మహిళ తన 13 ఏట లైంగిక వేధింపులకు గురైంది. ఆమె వయసు ప్రస్తుతం 44 సంవత్సరాలు. ఆమె తన బాల్యంలో రాజ్​పేఠ్​ పోలీస్ స్టేషన్ పరిధిలో


మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన ఓ మహిళ తన 13 ఏట లైంగిక వేధింపులకు గురైంది. ఆమె వయసు ప్రస్తుతం 44 సంవత్సరాలు. ఆమె తన బాల్యంలో రాజ్​పేఠ్​ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండేవారు. ఆ సమయంలో ఆమెపై సొంత సోదరుడే లైంగికంగా వేధించాడు. ఎనిమిది సంవత్సరాల పాటు నీచానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పవద్దని, చెప్తే అంతు చూస్తానని బెదిరించాడు. దీంతో ఆమె భయపడిపోయింది. అయినా అన్న చేసే వికృత పనులు అధికమవుతుండటంతో భరించలేకపోయింది. తనపై జరుగుతున్న రాక్షస కాండను బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. అండగా నిలవాల్సిన తల్లిదండ్రులు కుటుంబం పరువు పోతుందని మరోసారి ఇలాంటి కంప్లైంట్లు చేయవద్దని బెదిరించారు. కాలక్రమంలో ఆమె తండ్రి మరణించాడు. తల్లి అనారోగ్యానికి గురైంది. ఈ క్రమంలో బాధితురాలు పెళ్లయి.. పిల్లలూ పుట్టారు. కానీ చిన్నతనంలో సొంత అన్న చేతిలోనే అనుభవించిన నరకాన్ని ఆమె మర్చిపోలేక కుమిలిపోయింది. ఇక భరించడం తన వల్ల కాదని, నిజం చెప్పాల్సిందేనని నిర్ణియించుకుని భర్తకు జరిగిన విషయాన్ని చెప్పింది.భర్తతో కలిసి ముంబయిలోని మలాడ్​లో నివాసముంటున్న సోదరుడిపై అమరావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్, నోయిడా ఠాణాలోనూ ఫిర్యాదు చేసింది. కాగా.. ఆమె ఫిర్యాదు విన్న పోలీసులు నివ్వెరపోయారు. జరిగిన ఘోరం గురించి ఎవరికీ చెప్పకుండా 31 ఏళ్లు మౌనంగా ఎలా భరించిందోనని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us on