Bird Viral video: మాంజాలో ఇరుక్కొని ప్రాణం కోసం పక్షి విలవిల.. అర్ధరాత్రి హై రిస్క్‌ చేసి కాపాడిన సహాయక బృందం..

|

Sep 26, 2022 | 11:51 AM

ప్రాణాపాయంలో చిక్కుకున్న ఓ పక్షి ప్రాణాలు కాపాడేందుకు సహాయక బృందం పడ్డ శ్రమ ఇంత అంత కాదు. చిమ్మచీకటిని సైతం లెక్క చేయకుండా హైరిస్క్ చేశారు అధికారులు. హైదరాబాద్‌లో


ప్రాణాపాయంలో చిక్కుకున్న ఓ పక్షి ప్రాణాలు కాపాడేందుకు సహాయక బృందం పడ్డ శ్రమ ఇంత అంత కాదు. చిమ్మచీకటిని సైతం లెక్క చేయకుండా హైరిస్క్ చేశారు అధికారులు. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనతో అధికారులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ప్రభుత్వం ఎంత విజ్ఞప్తి చేసినా, అధికారులు ఎన్ని కేసులు నమోదు చేసినా ప్రజల్లో మాత్రం మార్పు రావట్లేదు. ప్రజల నిర్లక్ష్యం వల్ల, అధికారుల అలస్వతం వల్ల వందలాది మూగజీవాలు చైనా మాంజాకి బలై తమ ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా అర్థరాత్రి హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లోని గాంధీ విగ్రహం దగ్గర ఒక కాకి చైనా మాంజాలో ఇరుక్కు పోవడంతో స్థానికులు సహాయక బృందానికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందం.. సుమారు మూడు గంటల పాటు శ్రమించి మాంజా నుంచి కాకిని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీశారు.ఈ ఘటన స్థానిక ప్రజల హృదయాలను కలచివేసింది. ఇకనైనా చైనా మాంజాకు దూరంగా ఉండాలని, ప్రజలు, పక్షుల ప్రాణాలను కాపాడాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు చైనా మాంజా అమ్మే వ్యాపారులపై పీడి యాక్ట్ పెట్టి శాశ్వతంగా జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ వాసులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us on