కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకొని.. బిల్ చూసి ఖంగుతిన్న వ్యక్తి.. వీడియో

|

Oct 06, 2021 | 8:43 AM

గత రెండేళ్ల నుంచి సాధారణ జ్వరం, జలుబు వచ్చిన కరోనానేమో అని కంగారు పడిపోతున్నాం. పక్కన ఎవరైన దగ్గుతూ, తుమ్ముతూ కనిపిస్తే కరోనా ఏమోనని భయపడిపోతాం.

గత రెండేళ్ల నుంచి సాధారణ జ్వరం, జలుబు వచ్చిన కరోనానేమో అని కంగారు పడిపోతున్నాం. పక్కన ఎవరైన దగ్గుతూ, తుమ్ముతూ కనిపిస్తే కరోనా ఏమోనని భయపడిపోతాం. ఒకవేళ అలాంటి లక్షణాలు మనలో కనిపిస్తే టెస్టులు చేయించుకుంటాం. తాజాగా అమెరికాలోని ఓ వ్యక్తి తనకు కరోనా ఉందేమో అనుకొని టెస్టుకు వెళ్లాడు. తరువాత అతనికి పెద్ద షాక్‌ తగిలింది. అతను షాకయింది కోవిడ్‌ టెస్ట్‌ రిజల్ట్‌ చూసి కాదండోయ్‌.. ఆస్పత్రివారు వేసిన బిల్లు చూసి.. టెక్సాక్‌కు చెందిన ట్రెవిస్ వార్నర్ అనే వ్యక్తి క‌రోనా టెస్టులు చేయించుకున్నారు. పీసీఆర్ టెస్టులు చేయించుకున్న వార్న‌ర్‌కు ఆసుప‌త్రి యాజ‌మాన్యం ఏకంగా 54 వేల డాల‌ర్లు బిల్లు వేసింది. అంటే ఇండియన్‌ క‌రెన్సీలో సుమారు 40 ల‌క్ష‌లు. దీంతో దెబ్బకు షాక్ అయ్యాడు వార్నర్. ఇందులో పీసీఆర్ టెస్టులు, యాంటిజెన్ టెస్ట్ ఫెసిలిటీ ఫీజు అన్నీ కలిపి అంత పెద్దమొత్తం బిల్లు చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: మహీంద్రా సంచలన నిర్ణయం.. హైపర్‌ కారు తయారీపై మహీంద్రా ఫోకస్‌.. వీడియో

అంబానీని మించిన అదాని.. ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడుగా అదాని.. ఎందులోనో తెలుసా! వీడియో