చెన్నైలో కారు బీభత్సం.. సడన్ బ్రేక్‌కు బదులు యాక్సిలలేటర్ ఇవ్వడంతో..

|

Sep 28, 2023 | 6:54 PM

Chennai Car Accident: చెన్నైలో కారు బీభత్సం సృష్టించింది. కీల్పాక్కంలో రోడ్డు పక్క నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుడిపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ పాదచారుడు తీవ్ర గాయాలతో పాదచారుడు దుర్మరణం చెందాడు. ఈ రోడ్డు ప్రమాద ఘటన రోడ్డు పక్కన దుకాణంలోని సీసీటీవీ కెమరాల్లో రికార్డయ్యింది.

చెన్నైలో కారు బీభత్సం సృష్టించింది. కీల్పాక్కంలో రోడ్డు పక్క నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుడిపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ పాదచారుడు తీవ్ర గాయాలతో పాదచారుడు దుర్మరణం చెందాడు. ఈ రోడ్డు ప్రమాద ఘటన రోడ్డు పక్కన దుకాణంలోని సీసీటీవీ కెమరాల్లో రికార్డయ్యింది.  మృతుడిని పళనిగా పోలీసులు గుర్తించారు. పళని రోడ్డు పక్క నడుచుకుని వెళ్తుండగా..కారు వేగంగా దూసుకొచ్చి ఆ వ్యక్తిని ఢీకొంది. మరో మూడు వాహనాలు సైతం ధ్వంసమయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి.. కారును అతివేగంగా నడిపిన డ్రైవర్ జయకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కారును నడుపుతున్న డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడానికి బదులు యాక్సిలలేటర్ ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం జరిగిన ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి

Published on: Sep 28, 2023 06:31 PM