130 అడుగుల ఎత్తునుంచి పడినా బ్రతికే ఉంది.. కన్నీరు పెట్టిస్తున్న నర్స్ మాటలు !

Updated on: Jun 19, 2026 | 5:23 PM

బ్రెజిల్‌లో రోప్-జంపింగ్ సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదంలో విద్యార్థిని మారియా ఎదువార్డా రోడ్రిగ్స్ ప్రాణాలు కోల్పోయింది. రక్షణ తాడు లేకుండానే 130 అడుగుల ఎత్తు నుంచి కిందపడిన ఆమె, కొద్దిసేపు ప్రాణాలతోనే పోరాడిందని అక్కడే ఉన్న నర్స్ వెల్లడించింది. నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని ఆరోపణలు వెల్లువెత్తగా, ముగ్గురు ఇన్‌స్ట్రక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

బ్రెజిల్‌లో ఊహించని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక పాడుబడిన వంతెనపై నుంచి సుమారు 130 అడుగుల ఎత్తు నుండి కిందపడి మారియా ఎదువార్డా రోడ్రిగ్స్ అనే విద్యార్థిని దుర్మరణం పాలైంది. అయితే, అంత ఎత్తు నుండి పడినా ఆమె కొన్ని క్షణాల పాటు ప్రాణాలతోనే కొట్టుమిట్టాడిందని ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక నర్స్ వెల్లడించిన నిజం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. మారియా ఒక అన్‌లైసెన్స్‌డ్ సంస్థ ఆధ్వర్యంలో రోప్-జంపింగ్ చేయడానికి వెళ్ళింది. అయితే, నిర్వాహకుల ఘోర నిర్లక్ష్యం వల్ల ఆమెకు కనీసం రక్షణ తాడు కట్టకుండానే వంతెనపై నుండి కిందకు నెట్టేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న రైజా డయాస్ అనే నర్స్ ప్రమాదాన్ని గమనించి, వెంటనే కొండ దిగువకు పరుగెత్తింది. ఈ క్రమంలో నర్స్‌ వివరాల ప్రకారం..”నేను కిందకు వెళ్లేసరికి మారియా ఇంకా శ్వాస తీసుకుంటోంది. నాడి చాలా బలహీనంగా ఉంది. మేము కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నించి సీపీఆర్ చేశాం. కానీ అత్యవసర రెస్క్యూ టీమ్ వచ్చేసరికి తీవ్ర గాయాల వల్ల ఆమె కన్నుమూసింది” అని ఆ నర్స్ కన్నీటిపర్యంతమైంది. ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలని ఎన్నో కలలతో వెళ్లిన యువతి.. నిర్వాహకుల చిన్న పొరపాటుకు బలికావడం తీవ్ర సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటనకు కారణమైన ముగ్గురు ఇన్‌స్ట్రక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారీ ట్రాక్టర్‌ను తన రెక్కలతో ఆపేసిన పక్షి..! గుడ్ల రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టిన మాతృప్రేమ

ఒక సాధారణ వెల్డర్‌.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు!

Follow Us