స్కూటీలో భారీ పాము..భయంతో జనం పరుగులు

Updated on: Aug 03, 2026 | 8:15 AM

జగిత్యాల జిల్లా ధర్మపురిలో పార్క్ చేసిన స్కూటీలోకి భారీ పాము చొరబడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ స్కూటీ ముందు భాగాన్ని విప్పి పామును ఎలాంటి హాని లేకుండా సురక్షితంగా బయటకు తీశాడు. ఈ రెస్క్యూ దృశ్యాలు వైరల్‌గా మారాయి. వర్షాకాలంలో వాహనాలను స్టార్ట్ చేసే ముందు తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణంలో భయానక ఘటన జరిగింది. ఓ వ్యక్తికి సంబంధించిన స్కూటీలోకి భారీ పాము చొరబడడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ధర్మపురిలో పార్క్ చేసి ఉన్న ఓ స్కూటీ లోపలికి పాము వెళ్లడాన్ని గమనించిన స్థానికులు భయంతో కేకలు వేశారు. వాహనం చుట్టూ జనం గుమికూడడంతో కాసేపు అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన వాహనదారుడు స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే స్నేక్ క్యాచర్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. స్కూటీ లోపల దాక్కున్న పామును పట్టుకోవడం అంత సులువు కాలేదు. దీంతో ఆయన అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, స్కూటీ ముందు భాగాన్ని స్క్రూ డ్రైవర్‌తో విప్పాడు. ఆ లోపల దాక్కున్న పామును ఎట్టకేలకు ఎటువంటి గాయం కాకుండా, జాగ్రత్యగా పట్టుకుని రక్షించాడు. పామును సురక్షితంగా బయటకు తీయడంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా వైరల్‌గా మారాయి. ప్రస్తుత వాతావరణ మార్పుల నేపథ్యంలో పాములు ఆశ్రయం కోసం బైక్‌లు, స్కూటీల ఇంజిన్ భాగాలు లేదా ముందు వైపు ఖాళీ ప్రదేశాల్లోకి చొరబడే అవకాశం ఉందని స్నేక్ క్యాచర్లు హెచ్చరిస్తున్నారు. వాహనాలను స్టార్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సొంత ప్రయోగాలు చేయకుండా స్నేక్ క్యాచర్ ను పిలవాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

OTT కొత్త రూల్స్.. నిర్మాతలకు వరమా? శాపమా?

పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!

Chicken Manchurian: మంచూరియా చైనా వంటకం కాదు.. మన ఇండియాదే.. ఏ ఊరిదో తెలుసా?

విదేశాల్లో వర్క్‌ చేయాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌!

లేడీ ఏసీపీ సాహసం… కదులుతున్న బస్సుకు ఎదురుగా నిలబడి

Loading...
Unable to load recommendations.
Follow Us