ఈ పాము కాటేస్తే మరణ శాసనమే.. భూలోక నరకం

Updated on: Feb 20, 2026 | 1:27 PM

బ్రెజిల్‌లోని స్నేక్ ఐలాండ్ భూలోక నరకం. ఇది అత్యంత ప్రమాదకరమైన గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ విష సర్పాలకు ఆవాసం. ఇక్కడ చదరపు మీటర్‌కు ఒక పాము ఉండవచ్చు. వీటి విషం 3-5 రెట్లు బలమైనది, శరీరంలో రక్తస్రావం, అవయవాల వైఫల్యం కలిగించి గంటలో ప్రాణాలు తీస్తుంది. ఈ భయంకరమైన ద్వీపానికి వెళ్లడం ప్రాణాలను పణంగా పెట్టడమే.

భూలోక స్వర్గాలని మనం కశ్మీర్, అరకు వ్యాలీని చెప్పుకుంటాం. కానీ భూలోక నరకం లాంటి ప్రాంతాలూ ఉన్నాయి. అందులో ఒకటి బ్రెజిల్‌లోని స్నేక్ ఐలాండ్. ప్రపంచంలోనే ఇది ప్రమాదకర ద్వీపం. ఈ ద్వీపం గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ అనే విషపూరిత పాములకు ఆవాసంగా మారింది. ఈ స్నేక్ ఐలాండ్‌లో.. గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ జాతి విష సర్పాలు మాత్రమే ఉంటాయి. బయట మెయిన్‌ల్యాండ్‌పై ఉన్న పాములతో పోలిస్తే.. ఈ పాముల విషం 3-5 రెట్లు ప్రమాదకరం. ఈ పాము కాటేస్తే మరణ శాసనమే. గంటలో మృత్యు ఒడిలోకి చేరుకుంటారు. దీని విషం.. శరీరంలో అంతర్గతంగా రక్త స్రావం అయ్యేలా చేస్తుంది. మూత్రపిండాల ఫెయిల్యూర్, మెదడులో రక్తస్రావం అవుతుంది. యమపాశాన్నైనా ఆపగలమేమో కానీ.. ఈ పాము కాటేస్తే ప్రాణాలు కాపాడటం దాదాపు అసాధ్యం! అడుగడుగునా గండమే. ద్వీపంలో దాదాపు 2,000 నుంచి 4,000 వరకు గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ పాములు ఉంటాయని అంచనా . అంటే ఒక చదరపు మీటర్‌కు ఒక పాము ఉంటుంది. అంటే.. అడుగడుగునా ఒక పాము ‘బుస్..’ అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది. వాటి పలకరింపుకే.. సగం గుండె ఆగిపోతుంది. అయితే కేవలం ఈ ఒక్క ఐలాండ్‌కే పరిమితమై.. అంతరించిపోతున్న ఈ పాములను.. విషం కోసం అక్రమ రవాణా చేసిన ఘటనలూ ఉన్నాయి. బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో పామును వేల కొద్దీ డాలర్లకు విక్రయిస్తారన్న వార్తలు వచ్చాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్నారిని క్యాబ్‌లో మరిచిన తల్లితండ్రులు.. చివరికి ??

రాత్రి పూట అన్నం తినడం మంచిదా.. రోటీ మంచిదా ??

పెళ్లికి కుటుంబ సమేతంగా విచ్చేసిన రారాజు.. అతిథులు భయంతో..

రైతును పెళ్ళాడితే రూ.10 లక్షలు.. అంతే కాకుండా

విద్యార్థులపై హెడ్ మాస్టర్ ప్రతాపం.. విచక్షణ లేకుండా అలా ఎలా చేశారు సర్

Follow Us