Non-veg lovers: నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్.. అధికారులు తనిఖీల్లో భయానక నిజాలు.. కుళ్లిన చికిన్ మరియు..

|

Sep 01, 2022 | 9:39 PM

సాధారణంగా నాన్‌వెజ్‌ ప్రియులకు ముక్కలేనిదే ముద్ద దిగదు. ప్రతిరోజూ ఏదో విధంగా మాంసాహారం తీసుకుంటారు. రోజూ కుదరనివారు.. సండే రోజు తప్పక నాన్‌వెజ్‌కోసం పరుగెడతారు..


సాధారణంగా నాన్‌వెజ్‌ ప్రియులకు ముక్కలేనిదే ముద్ద దిగదు. ప్రతిరోజూ ఏదో విధంగా మాంసాహారం తీసుకుంటారు. రోజూ కుదరనివారు.. సండే రోజు తప్పక నాన్‌వెజ్‌కోసం పరుగెడతారు. చికెన్, ఫిష్, మటన్, రొయ్యలు ఇలా ఎవరికి నచ్చింది వారు తెచ్చుకుని వండుకుని తింటారు. ఇలాంటి నాన్‌వెజ్‌ ప్రియులకు ఓ షాకింగ్ న్యూస్. మీరు తినే ఈ నాన్‌వెజ్‌ ఫ్రెష్‌దేనా.. లేక కుళ్లిన మాంసమా..చెక్‌ చేసుకుంటున్నారా.. ఎందుకంటే.. విజయవాడలోని నాన్‌వెజ్‌ మార్కెట్‌లో అధికారులు చేసిన తనిఖీల్లో భయంకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళ్తే..కొత్తపేట హనుమంతరాయ చేపల మార్కెట్‌లో విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల్లో వ్యాపారస్తుల మోసం బట్టబయలైంది. 80 కేజీల కుళ్లిపోయిన చికెన్‌, మేక తలకాయలు, కాళ్లను గుర్తించారు అధికారులు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. మాంసాన్ని క్వాలిటీ ఉన్నచోట తీసుకోవాలని.. లేకపోతే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని హెచ్చరించారు. సుమారు 25 మేక తలకాయలు, కాళ్లను కుళ్ళిపోయినట్టుగా గుర్తించామన్నారు. కుళ్ళిపోయిన మాంసాన్ని విక్రయించిన వ్యాపారులకు ఫైన్ విధించినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునారావృతం అయితే కేసులు పెడతామన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Pawan Kalyan: వన్‌ అండ్‌ ఓన్లీ పవర్ స్టార్‌.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).

Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)

 

Published on: Sep 01, 2022 09:39 PM