వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో
Woman Crossing Track

వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

|

Jul 23, 2022 | 8:44 PM

రైలు ప్రయాణాల్లో తరచూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు సూచిస్తూనే ఉంటారు. ఒక ప్లాట్‌ ఫారం మీదనుంచి మరో ప్లాట్‌ఫారం మీదకు వెళ్లడానికి పట్టాలపైనుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు చాలామంది.

రైలు ప్రయాణాల్లో తరచూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు సూచిస్తూనే ఉంటారు. ఒక ప్లాట్‌ ఫారం మీదనుంచి మరో ప్లాట్‌ఫారం మీదకు వెళ్లడానికి పట్టాలపైనుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు చాలామంది. అలా ప్రమాదాలు కొని తెచ్చుకుంటుంటారు. అధికారులు, రైల్వే పోలీసులు ఎంత అవగాహన కల్పించినా పెడ చెవిన పెడుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత్‌ నందా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లకు ఒణుకు పుట్టిస్తోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కొందరు భువనేశ్వర్‌లోని రైల్వే స్టేషన్‌లో రైలు దిగారు. కాగా వారు ప్లాట్‌ఫారం వైపు దిగకుండా వేరే ద్వారం గుండా రైలు దిగారు. పట్టాలపైనుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఆ పట్టాలపైనుంచి మరో రైలు వేగంగా దూసుకొచ్చింది. ఆ క్రమంలో ఓ యువతి అవతలినుంచి ఇవతలికి పట్టాలపైనుంచి దాటుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: ఇంత పెద్ద అరటిగెలని జీవితంలో చూసి ఉండరు.. ఎన్ని కాయలో తెల్సా

Published on: Jul 23, 2022 08:44 PM