చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి

Updated on: Feb 06, 2026 | 7:35 PM

రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక దుకాణదారుడు మూడేళ్ల చిన్నారికి చాక్లెట్ అని పేలుడు పదార్థం ఇవ్వగా, అది నోట్లో పేలిపోయింది. చిన్నారి దవడ ఛిద్రమై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడి కోలుకుంటోంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన సమాజంలో భద్రతపై ఆందోళన రేకెత్తిస్తుంది.

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా చౌకీబాస్ గ్రామంలో హృదయవిదారక ఘటన జరిగింది. దుకాణాదారుడు ఇవ్వగా చాక్లెట్ అనుకుని ఓ మూడేళ్ల చిన్నారి నోట్లో పేలుడు పదార్థాన్ని పెట్టుకుంది. సంతోషంతో వెంటనే పళ్ల కింద వేసి కొరకగా.. అది బాంబులా ఒక్కసారిపేలిపోయింది. దీంతో చిన్నారి దవడ ఛిద్రమై రక్తపుమడుగులో పడిపోయింది. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడినప్పటికీ.. తీవ్ర గాయాలతో ఇబ్బంది పడుతోంది. ఏం జరిగిందంటే.. బాధిత చిన్నారి అక్షు తన ఆరేళ్ల అక్క అహానాతో కలిసి తన గ్రామంలో ఫిబ్రవరి 3న ఇంటి సమీపంలోని ఒక కిరాణా దుకాణానికి వెళ్లింది. చాక్లెట్ కావాలని అక్కడి దుకాణదారుడు సుదీల్ అలియాస్ కాలాను అడిగింది. అతడు కూడా వెంటనే ఆ చిన్నారికి చాక్లెట్ తరహాలో ఉన్న ఒక వస్తువును ఇచ్చాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అది చూడటానికి అచ్చం చాక్లెట్‌లా ఉండటంతో అక్షు దానిని వెంటనే నోట్లో పెట్టుకుని కొరికింది. మరుక్షణమే అది భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు ధాటికి చిన్నారి దవడ, చెంప భాగం తీవ్రంగా చిధ్రమై రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన చిన్నారి అత్త ఆమెను అల్వార్‌లోని సానియా ఆసుపత్రికి తరలించారు. మాక్సిల్లోఫేషియల్ సర్జన్లు కలిసి చిన్నారి దవడ భాగాన్ని సరిచేశారు. ప్రస్తుతం ఆపరేషన్ విజయవంతం అయిందని.. చిన్నారి కోలుకుంటోందని వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడైన దుకాణదారుడు సుదీల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే తాను తప్పు చేయలేదని, చిన్నారి గాజు ముక్కలపై పడటం వల్లే ఆ గాయాలు అయ్యాయని నిందితుడు బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ గాయాల తీవ్రతను బట్టి చూస్తే.. అది కచ్చితంగా పేలుడు వల్ల జరిగిందేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుంచి నమూనాలను సేకరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రిని భుజంపై మోస్తూ.. గుండెల్ని పిండేసే ఘటన..

ప్రమాదకర విన్యాసాలతో హైవేపై రెచ్చిపోయిన యువకులు..

గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో భారీ ఊరట

లిఫ్ట్‌లో గ్యాస్ బెలూన్లు తీసుకెళ్తున్న డెలివరీ బోయ్‌.. అంతలోనే.. ఇలా జరుగుతుందని అనుకోలేదు

TTD: అర్చకులకు టీటీడీ శిక్షణ ప్రారంభం