కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే

Updated on: Feb 12, 2026 | 1:48 PM

ప్రొద్దుటూరు పోలీసులు అంతర్రాష్ట్ర డబ్బు రెట్టింపు మోసాల ముఠా గుట్టు రట్టు చేశారు. మాయా సూట్‌కేసుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, రూ. 8.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రూ. 33 లక్షలకు రూ. 50 లక్షలు ఇస్తామని గంగా ప్రసాద్‌ను మోసం చేశారు. ప్రజలు ఇలాంటి అత్యాశకు పోవద్దని పోలీసులు హెచ్చరించారు.

డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టుచేశారు ప్రొద్దుటూరు పోలీసులు . సినిమా ఫక్కీలో మోసానికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. గోకుల్ నగర్‌కి చెందిన గంగా ప్రసాద్ అనే వ్యక్తికి కేటుగాళ్లు గాలం వేశారు. రూ. 33 లక్షలు నగదుగా ఇస్తే, ప్రతిఫలంగా రూ. 50 లక్షలు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేస్తామని నమ్మబలికారు. బాధితుడు డబ్బుతో రాగా, నిందితులు ఒక మాయా సూట్‌కేసును సిద్ధం చేశారు. గంగా ప్రసాద్ తెచ్చిన రూ. 33 లక్షలను ఆ సూట్‌కేసులో పెట్టించి, చాకచక్యంగా దాని అడుగు భాగం నుంచి డబ్బును మార్చేశారు. కొద్దిసేపటి తర్వాత “ఆన్‌లైన్ సర్వర్ పని చేయడం లేదు.. మీ డబ్బు మీరు తీసుకోండి అని చెప్పి, నోట్ల కట్టల ఆకారంలో ఉన్న ఖాళీ పేపర్ బండిల్స్ ఉన్న బ్యాగును అతనికి అప్పగించి పరారయ్యారు. ఇంటికి వెళ్లి చూసుకున్న బాధితుడు తాను మోసపోయానని గ్రహించి టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితులు గంగులయ్య , పఠాన్ , నగేష్, గోపాల్, పెంచలయ్య లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 8.5 లక్షల నగదు, ఒక కత్తి, మోసానికి వాడిన సూట్‌కేసును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సూట్‌కేసులోని అరల ద్వారా నోట్ల కట్టలను ఎలా మాయం చేశారో ప్రొద్దుటూరు ఏఎస్పీ స్వయంగా డెమో ఇచ్చి మీడియాకు వివరించారు. ప్రజలు ఇటువంటి అత్యాశకు పోయి మోసపోవద్దని పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి రూ. 1.50 లక్షల టోకరా.. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్

దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్‌.. అతడిలా కోటికి ఒక్కరుంటారు

Srisailam: శ్రీశైలం నడకదారిలో పెద్దపులి ప్రత్యక్షం.. అంతా మల్లన్న మాయ అంటూ

Sapota: బాగా పండిన సపోటాలు తింటే ఏమవుతుందో తెలుసా ?? ఈ వీడియో తప్పక చూడండి

Balakrishna: బాలయ్య దెబ్బ.. కుర్ర హీరోలు అందరూ అబ్బా..