దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. అంటూ పోలీసులకు దొంగ సవాల్ !!
విజయనగరం జిల్లాలో ఓ దొంగ పోలీసుల సహనానికి పరీక్ష పెట్టాడు. చికెన్ షాపులో దొంగతనం చేసి, "దమ్ముంటే నన్ను పట్టుకోరా షెకావత్" అంటూ సవాల్ విసిరాడు. ఈ వింత ఘటన సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. వరుసగా అదే షాపులో చోరీలు జరుగుతుండటంతో యజమాని భయాందోళన చెందుతున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
విజయనగరం జిల్లాలో ఒక దొంగ పోలీసుల సహనానికి పరీక్ష పెట్టాడు. కేవలం దొంగతనం చేసి వెళ్ళిపోకుండా, ఏకంగా పోలీసులకే సవాల్ విసిరిన వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “దమ్ముంటే నన్ను పట్టుకోండి” అంటూ రాసి పెట్టిన ఆ దొంగ ధైర్యం చూసి స్థానికులు విస్తుపోతున్నారు. చీపురుపల్లి లావేరు రోడ్డులోని రావివలస జంక్షన్ వద్ద ఉన్న ‘అభిరుచి చికెన్ షాపు’ తాళాలు పగులగొట్టి దుండగుడు లోపలికి ప్రవేశించాడు. అక్కడ సుమారు రూ.2,500 నగదును దోచుకున్నాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న కేవీఆర్ చికెన్ దుకాణంలోకి కూడా చొరబడ్డాడు. అక్కడ నగదు దొరక్కపోయేసరికి, ఆ దొంగ తన ‘క్రియేటివిటీ’కి పనిచెప్పాడు. దుకాణంలోని నగదు కౌంటర్ వద్ద ఉన్న పుస్తకంపై పెన్సిల్‌తో ఒక వాహనం నంబరు రాసాడు..అక్కడే ఉన్న ఒక ప్లేట్ పై “దమ్ముంటే నన్ను పట్టుకోరా షెకావత్” అంటూ రాసి పోలీసులను ఉద్దేశించి సవాల్ విసిరాడు. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఆ వాహనం నంబరు రాశాడా లేక కావాలనే ఇలా రెచ్చగొడుతున్నాడా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అభిరుచి చికెన్ సెంటర్‌లో ఇలా జరగడం ఇది రెండోసారి. గత నెల 10న కూడా ఇదే షాపులో రూ.32 వేల నగదు చోరీకి గురైంది. వరుసగా ఒకే షాపును టార్గెట్ చేయడంతో యజమాని తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నాడు. దొంగ చేసిన హడావుడి అంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. పోలీసులు ఫుటేజీని స్వాధీనం చేసుకుని, దొంగను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉబెర్ డ్రైవర్ నిజాయితీ.. నెటిజన్ల సెల్యూట్!
కోట్ల ఏళ్ల క్రితం మీ ఊరు ఎక్కడుందో చెప్పేసే ఆన్‌లైన్ టూల్
