మద్యం తరలిస్తున్న కారుకు యాక్సిడెంట్‌.. బాటిళ్లకోసం ఎగబడిన జనం

Updated on: Nov 02, 2023 | 9:15 PM

బీహార్‌లో మద్యం తరలిస్తున్న ఓ వాహనానికి యాక్సిడెంట్‌ జరిగింది. ఎవరికైనా ప్రమాదం జరిగిందేమోనని సాయం చేయడానికి స్థానికులు అక్కడికి వెళ్లారు. అయితే సాయం చేయడానికి బదులు అక్కడ కనిపించిన మద్యం బాటిళ్లను ఎత్తుకుని ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఇప్పటికే బీహార్‌లో మద్యనిషేధం అమలులో ఉంది. అయినా అక్కడ మద్యం అక్రమ రవాణాకి మాత్రం అడ్డుకట్టపడటంలేదు. ఈ క్రమంలో ఓ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా... ఆ కారు ప్రమాదానికి గురైంది.

బీహార్‌లో మద్యం తరలిస్తున్న ఓ వాహనానికి యాక్సిడెంట్‌ జరిగింది. ఎవరికైనా ప్రమాదం జరిగిందేమోనని సాయం చేయడానికి స్థానికులు అక్కడికి వెళ్లారు. అయితే సాయం చేయడానికి బదులు అక్కడ కనిపించిన మద్యం బాటిళ్లను ఎత్తుకుని ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఇప్పటికే బీహార్‌లో మద్యనిషేధం అమలులో ఉంది. అయినా అక్కడ మద్యం అక్రమ రవాణాకి మాత్రం అడ్డుకట్టపడటంలేదు. ఈ క్రమంలో ఓ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా… ఆ కారు ప్రమాదానికి గురైంది. ఈక్రమంలో స్థానికులు మద్యం సీసాలు ఎత్తుకొని పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… ఓ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే వేగంగా వెళుతున్న ఆ కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరగడంతో దారిన వెళ్లే వారు సాయం చేసేందుకు వచ్చారు. అప్పటికే అందులో ఉన్న వారు కారును వదిలి పారిపోయారు. అయితే.. లోపల మద్యం బాటిళ్లు కనిపించడంతో స్థానికుల కళ్లు మెరిసాయి. అంతే దొరికిన వారికి దొరికినంత అన్నట్టుగా కారులోని బాటిళ్లు మొత్తం ఎత్తుకుని వెళ్లిపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

LPG Cylinder: మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంతంటే ??

Published on: Nov 02, 2023 09:14 PM
Loading...
Unable to load recommendations.
Follow Us