Peacock viral: అద్భుత దృశ్యం.. పోటాపోటీగా ఎగురుతున్న నెమళ్లు.. చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు..

|

Jul 05, 2022 | 1:48 PM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చాలానే చూస్తుంటాం. ఉల్లాసకరమైన వీడియోలు ఇంటర్నెట్‌లో త్వరగా వైరల్ అవుతాయి. నెమళ్లు డ్యాన్స్ చేసే వీడియోలను చూడటానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చాలానే చూస్తుంటాం. ఉల్లాసకరమైన వీడియోలు ఇంటర్నెట్‌లో త్వరగా వైరల్ అవుతాయి. నెమళ్లు డ్యాన్స్ చేసే వీడియోలను చూడటానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇటీవల నెమలి ఎగురుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. నెమళ్లకు ఎక్కువ దూరం ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. బహుశా వాటి శరీరాలు ఇతర పక్షుల కంటే బరువుగా ఉండటంవల్లే కావచ్చు. అయితే ఇక్కడ ఓ నెమళ్ల గుంపు గాల్లో ఎగురుతూ అందరినీ ఆకర్షిస్తుంది.ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక సరస్సు మీదుగా నెమళ్లు ఎగురుతున్నాయి. ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు ఎగురుతున్న ఈ వీడియో ఇంటర్‌నెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఎక్కడో పార్క్ లాంటి ప్రదేశమని వీడియో చూస్తే అర్థమవుతోంది. అక్కడ నెమళ్లు ఎగరడం చూస్తుంటే వాటన్నింటికీ ఎగిరే పోటీని ఏర్పాటు చేసినట్లు అనిపిస్తుంది. ఆ దృశ్యం చూడ్డానికి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఈ వీడియోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వేల సంఖ్యలో నెటిజన్నలు ఈ వీడియోని వీక్షిస్తూ లైక్‌ చేస్తూ.. కామెట్లు పెడుతూ షేర్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Follow us on