Passenger Ruckus: విమానం గాల్లో ఉండగా యువకుడు వీరంగం.. కిటికీలను పగలగొడుతూ , షర్టు విప్పేసి..!

|

Sep 26, 2022 | 11:40 AM

విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు నానా హంగామా సృష్టించాడు. విమాన సిబ్బందితో గొడవపడుతూ.. షర్టు విప్పేసి అర్దనగ్నంగా ఆవేశంతో రెచ్చిపోయాడు...


విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు నానా హంగామా సృష్టించాడు. విమాన సిబ్బందితో గొడవపడుతూ.. షర్టు విప్పేసి అర్దనగ్నంగా ఆవేశంతో రెచ్చిపోయాడు. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం పీకే-283 పెషావర్ నుంచి దుబాయ్‌కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత ఓ ప్రయాణికుడు ఉద్దేశపూర్వకంగానే క్యాబిన్ క్రూతో గొడవకు దిగాడు. నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ అనుచితంగా ప్రవర్తించాడు. కోపంతో ఊగిపోతూ తన ఒంటిపై షర్టు విప్పేసి, సీట్లపై పిడిగుద్దులు కురిపించాడు. విమానం కిటికీలను కాళ్లతో తన్ని, వాటిని పగలగొట్టేందుకు యత్నించాడు. అనంతరం కింద బోర్లా పడుకుని దారుణంగా ప్రవర్తించాడు. ఆ వ్యక్తిని సముదాయించడానికి విమాన సిబ్బంది ఎంత ప్రయత్నించినా శాంతించలేదు. సిబ్బందిపై కూడా దాడికి ప్రయత్నించడంతో సీటుకు కట్టేశారు. అనంతరం ఏటీసీకి సమాచారం ఇచ్చి సిబ్బంది.. భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. అనంతరం దుబాయ్‌ విమానాశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, అతడి అనుచిత ప్రవర్తనతో పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. సెప్టెంబరు 14న పెషావర్-దుబాయ్ విమానంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us on