పరిశోధనలో బయటపడిన 2,000 ఏళ్ల నాటి ‘మెషిన్ గన్’

Updated on: Apr 21, 2026 | 1:12 PM

క్రీ.పూ. 89లో రోమన్ జనరల్ సూలా పాంపీని ముట్టడించినప్పుడు 'పాలిబోలోస్' అనే పురాతన మెషిన్ గన్ వంటి ఆయుధాన్ని ఉపయోగించినట్లు బోలోగ్నా విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. లేజర్ స్కానింగ్, 3D ఇమేజింగ్ ద్వారా కోట గోడలపై వేగవంతమైన బాణాల దాడి గుర్తులు గుర్తించారు. గ్రంథాల్లో మాత్రమే ఉన్న ఈ రిపీటింగ్ కాటపల్ట్ వాడకానికి ఇది బలమైన సాక్ష్యం. పాంపీ చరిత్రలో అగ్నిపర్వతం ముందే జరిగిన ఒక ముఖ్యమైన సైనిక ఆవిష్కరణ ఇది.

ఇటలీలోని పాంపీ నగరం.. అంటే క్రీస్తుశకం 79లో వెసువియస్ అగ్నిపర్వతం పేలడంతో బూడిదలో మునిగిన నగరం.. గుర్తొస్తుంది . అయితే అంతకంటె దాదాపు 170 సంవత్సరాల ముందే అక్కడ ఒక యుద్ధం జరిగింది. యుద్ధంలో పురాతన కాలం నాటి ‘మెషిన్ గన్’గా పిలిచే ‘పాలిబోలోస్’ అనే శక్తిమంతమైన ఆయుధాన్ని అక్కడ వాడినట్లు పరిశోధకులు గుర్తించారు. వేగంగా బాణాలు సంధించే ప్రత్యేక ఆయుధాన్ని ఉపయోగించినట్లు ఆధారాలు బయటపడ్డాయి. ఇటలీ బోలోగ్నా యూనివర్సిటీల పరిశోధకులు లేజర్ స్కానింగ్, 3D డిజిటల్ ఇమేజింగ్ టెక్నాలజీతో ఈ ఆవిష్కరణ చేశారు. పాంపీ నగరం ఉత్తర ప్రాంతంలోని కోట గోడలపై బాణాల దాడికి సంబంధించిన ప్రత్యేకమైన గుర్తులను గుర్తించారు. ఈ గుర్తులు చిన్నవిగా, గుంపులుగా ఉన్నాయి. ఒకే చోటు నుంచి వేగంగా బాణాలను ప్రయోగించడం వల్లే ఇలాంటి గుర్తులు ఏర్పడతాయని పరిశోధకులు గుర్తించారు. ఈ దాడి క్రీ.పూ. 89లో రోమన్ జనరల్ లూసియస్ కార్నెలియస్ సూలా, పాంపీని ముట్టడించినప్పుడు జరిగిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తన తూర్పు మధ్యధరా సైనిక చర్యల సమయంలో సూలా ఈ అధునాతన ఆయుధాన్ని, దాని టెక్నాలజీని పొంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పాలిబోలోస్ అనేది ఒకేసారి అనేక బాణాలను వేగంగా సంధించగల రిపీటింగ్ కాటపల్ట్. గ్రావిటీ ఫీడ్ మ్యాగజైన్ సహాయంతో బాణాలను ఆటోమేటిక్‌గా లోడ్ చేసుకుని నిరంతరాయంగా దాడి చేయగల సామర్థ్యం దీనికి ఉంది. ఈ ఆయుధానికి సంబంధించిన భౌతిక అవశేషాలు ఏవీ లభించనప్పటికీ, గోడలపై ఉన్న ఈ బాలిస్టిక్ గుర్తులే దాని వాడకానికి బలమైన సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం గ్రంథాల్లో మాత్రమే ప్రస్తావన ఉన్న పాలిబోలోస్ ఆయుధం వాస్తవంగానే ఉనికిలో ఉండేదని ఈ పరిశోధన నిరూపించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాజశేఖర్‌తో జగన్‌ను నటించమని అడిగా.. అందుకు ఆయన..?

Loading...
Unable to load recommendations.
Follow Us