పాము కాటుతో యువకుడు మృతి.. అయ్యో ఆ కుటుంబం ఎందుకు అలా చేసింది.. అందరూ షాక్..!

|

Aug 02, 2022 | 9:25 AM

ప్రస్తుత వర్షాకాలంలో పుట్టల్లో ఆవాసాలు కోల్పోయిన పాములు.. జనావాసాల్లోకి వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే పాముకాట్లకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో యూపీలోని మెయిన్​పురి జిల్లా


ప్రస్తుత వర్షాకాలంలో పుట్టల్లో ఆవాసాలు కోల్పోయిన పాములు.. జనావాసాల్లోకి వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే పాముకాట్లకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో యూపీలోని మెయిన్​పురి జిల్లా​ మొహల్లా గ్రామానికి చెందిన యువకుడు తాలీబ్ శుక్రవారం తెల్లవారుజామున పాముకాటుకు గురయ్యాడు. అతడని వెంటనే దగ్గర్లోకి హాస్పిటల్‌కి తరలించారు. కానీ అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. అయితే తాలీబ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. మళ్లీ అతడిని బతికించుకోవాలని ఉద్దేశంతో.. మాంత్రికులను, తాంత్రికులను.. స్నేక్ క్యాచర్స్‌ను పిలిపించారు. గ్రామస్థులు కూడా ఆ కుటుంబానికి సహకరించారు. 30 గంటల పాటు ఏవేవో పూజలు చేశారు. డప్పులు వాయిస్తూ.. డెడ్ బాడీని ఇంటి ముందు పెట్టి వేప, అరటి కొమ్మలు పెట్టి కుద్రపూజలు చేశారు. ఈ క్రమంలోనే తాలీబ్‌ను కాటేసిన పామును పట్టేందుకు నలుగురు స్నేక్ క్యాచర్స్‌ను రంగంలోకి దించారు. మూఢ నమ్మకాలు కాకపోతే చనిపోయిన మనిషి ఎలా బ్రతికొస్తాడు చెప్పండి. దీంతో చేసేదేం లేక.. గ్రామ పెద్దలు వారించడంతో.. ఆదివారం సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.పంజాబ్‌లో పనిచేసే తాలీబ్ 10 రోజుల క్రితమే సొంతూరుకి వచ్చాడు. ఇలా పాము కాటుకు గురై మరణించాడు. శాడ్ పార్ట్ ఏంటంటే.. కొన్ని రోజులు క్రితమే అతడి మేనల్లుడు పాము కాటుతో చనిపోయాడు. తమ కుటుంబంలోని వ్యక్తులను పాములు పగ బట్టాయని వారు బలంగా నమ్ముతున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి.. ఆ ప్రాంతంలో పాముల సంచారానికి బ్రేక్ వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us on