బాత్రూమ్‌లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..

Updated on: Jun 20, 2026 | 2:51 PM

ఒంగోలు జిల్లా యర్రగొండపాలెంలో ఓ ఇంటి బాత్రూమ్‌లో కనిపించిన బ్రోంజ్‌బ్యాక్ జాతి పాము స్థానికుల్లో భయాందోళనలు కలిగించింది. అటవీశాఖకు సమాచారం ఇచ్చినా స్నేక్ క్యాచర్ అందుబాటులో లేకపోవడంతో స్థానికులు పామును చంపేశారు. అయితే ఇది విషరహిత పామని, మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. స్నేక్ క్యాచర్ల నియామకంపై స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఒంగోలు జిల్లా మార్కాపురం పరిధిలోని యర్రగొండపాలెం కొండారెడ్డి కాలనీలో ఓ వింత ఘటన కలకలం రేపింది. కాలనీకి చెందిన రమణమూర్తి ఇంట్లోని బాత్రూమ్ నుండి వింత శబ్దాలు వచ్చాయి. ఏంటా అని లోపలికి వెళ్లి చూసిన యజమానికి మైండ్ బ్లాంక్ అయ్యే దృశ్యం కనిపించింది. తీవ్రమైన ఎండవేడికి తట్టుకోలేక, సేదతీరడం కోసం ఓ సన్నటి పొడవాటి పాము బాత్రూమ్‌లోని నీళ్ల బకెట్‌పై తిరుగుతూ కనిపించింది. భయంతో ఆయన బయటకు పరుగులు తీసి, వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే కార్యాలయంలో ‘స్నేక్ క్యాచర్’ లేరని, మార్కాపురం నుండి పిలిపించాల్సి ఉంటుందని అధికారులు సమాధానమిచ్చారు. దీంతో అప్పటివరకు వేచి చూడలేక, భయాందోళనకు గురైన స్థానికులు ఆ పామును కర్రలతో కొట్టి చంపేశారు. నిజానికి, రమణమూర్తి ఇంట్లోకి దూరిన ఆ పాము ‘బ్రోంజ్‌బ్యాక్’ జాతికి చెందినది. ఇది పూర్తిగా విషం లేని పాము. మనుషులకు దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. దీని శరీరం సన్నగా, పొడవుగా ఉండి, వీపుపై కంచు రంగుతో ఉంటుంది… గోధుమ రంగు చారలు ఉంటాయి… ఇవి చెట్లు, పొదలు, ఇళ్ళ పరిసరాల్లో సంచరిస్తూ బల్లులు, కప్పలను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి వేగంగా కదులుతూ, ఒక చెట్టుపై నుంచి మరో చెట్టు పైకి ఎగురుతూ సంచరిస్తుంటాయి. రాత్రిళ్ళు ఇవి బయటకు రావు. పగటిపూట మాత్రమే తిరుగుతాయి. వీటిని చూసిన వెంటనే చంపకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇస్తే వాటిని పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. యర్రగొండపాలెం ఘటనలో అటవీశాఖ కార్యాలయంలో స్నేక్‌ క్యాచర్‌ లేకపోవడతో స్థానికులు పామును కొట్టి చంపేశారని.. ఇప్పటికైనా స్నేక్‌ క్యాచర్‌ను నియమించాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్‌ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌! జూన్ 30 లాస్ట్‌ డేట్‌ ఏం చేయాలంటే?

ఇక పై డాక్టర్ చిట్టీ ఉంటేనే దగ్గు మందు! కాఫ్‌ సిరప్ కు బానిసగా యూత్‌.. చిన్నారుల ప్రాణం తీసే సిరప్!

సహారాలోనూ తప్పని ఆన్‌లైన్‌ మీటింగ్‌! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..

ఏంటి ఈ సరికొత్త ఆన్‌లైన్‌ షాపింగ్‌ విధానం?

ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..

Follow Us