ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు.. వంటచెయ్యరు.. ఎందుకో తెలుసా?
గుజరాత్‌లోని చందంకి గ్రామంలో వృద్ధుల కోసం సామూహిక వంటశాల ప్రత్యేకంగా నిలుస్తోంది. యువత ఉద్యోగాల కోసం వలస వెళ్లడంతో గ్రామంలో మిగిలిన వృద్ధులకు రోజూ వంట చేసుకునే ఇబ్బందులు తొలగించేందుకు సర్పంచ్ పూనంభాయ్ పటేల్ ఈ ఏర్పాటును ప్రారంభించారు. రోజుకు రెండుసార్లు సంప్రదాయ వంటకాలతో భోజనం అందిస్తున్నారు. అందరూ కలిసి తినడం వల్ల ఒంటరితనం తగ్గి, వృద్ధులకు ఆరోగ్యకరమైన జీవనంతో పాటు ఆత్మీయత కూడా లభిస్తోంది.
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు, గిన్నెలు కడిగే శబ్దాలూ వినిపించవు. అయినా సరే, ఊరంతా ఒక పండగలా కలిసికట్టుగా భోజనం చేస్తారు. ఈ వినూత్నమైన, ఆదర్శవంతమైన జీవనశైలిని చూడాలంటే గుజరాత్‌లోని ‘చందంకి’ అనే గ్రామానికి వెళ్లాల్సిందే. గతంలో వెయ్యికి పైగా జనాభా ఉన్న ఈ ఊరి నుంచి ఉపాధి, ఉద్యోగాల కోసం యువత నగరాలకు వలస వెళ్లారు. దీంతో ఊళ్లో 70 నుంచి 80 ఏళ్ల వయసున్న వందమంది వృద్ధులు మాత్రమే మిగిలారు. ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా, వయోభారం వల్ల సరుకులు తెచ్చుకుని రోజూ వంట చేసుకోవడం వారికి నరకంగా మారింది. ఈ సమస్యను గమనించిన గ్రామ సర్పంచ్ పూనంభాయ్ పటేల్ ‘సామూహిక వంటశాల’ అనే అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సర్పంచ్ చొరవతో గ్రామంలోనే ఒక వంటశాలను నిర్మించి, వంట మనుషులను నియమించారు. ఇక్కడ రోజుకు రెండు పూటలా పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గుజరాతీ సంప్రదాయ వంటకాలతో పాటు స్నాక్స్ కూడా అందిస్తారు. వృద్ధులంతా ఒకే చోట చేరి ముచ్చటించుకుంటూ భోజనం చేయడం వల్ల ఒంటరితనం పోయి పండగ వాతావరణం నెలకొంటోంది. ఈ వంటశాల ఖర్చుల కోసం నెలకు రూ. 2,500 ఫీజుగా నిర్ణయించగా, నగరాల్లో ఉన్న వారి పిల్లలే ఆ డబ్బును చెల్లిస్తున్నారు. ఇక్కడి వంటకాల్లో పాటించే ఆరోగ్య సూత్రాల వల్ల కరోనా మహమ్మారి సమయంలో కూడా ఏ ఒక్క వృద్ధుడూ వైరస్ బారిన పడకపోవడం విశేషం. అంతేకాకుండా, సోలార్ విద్యుత్‌ను ఉపయోగిస్తూ ఖర్చులు తగ్గించుకుంటున్నారు. వృద్ధులకు గౌరవప్రదమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తున్న చందంకి గ్రామం ఈనాటి సమాజానికి, చుట్టుపక్కల ఊళ్లకు ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభం
కొత్త కారు.. షోరూమ్‌నుంచి బయటకు తీస్తుండగా.. ఏం జరిగిందో మీరే చూడండి
KimJongUn: కిమ్ జోంగ్ ఉన్ ఇక లేరా.. సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత?
