8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?

Updated on: Feb 06, 2026 | 7:49 PM

ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ట్యాంకర్ ప్రమాదంతో గంటల తరబడి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నరకంలో చిక్కుకున్న 'ఎకా మొబిలిటీ' చైర్మన్ డా. సుధీర్ మెహతా హెలికాప్టర్‌లో తప్పించుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, అత్యవసర పరిస్థితుల్లో హెలిప్యాడ్‌లు, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఇది రోడ్డు భద్రత, అత్యవసర సేవల్లో లోపాలను ఎత్తిచూపుతోంది.

ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌వే అంటేనే వేగవంతమైన ప్రయాణానికి మారుపేరు. కానీ, ఇటీవల అక్కడ చోటుచేసుకున్న ఒక ప్రమాదం వేలమంది ప్రయాణికులకు నరకాన్ని చూపించింది. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త, చివరికి హెలికాప్టర్ ద్వారా అక్కడి నుంచి బయటపడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే…మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లా అదోషీ టన్నెల్ సమీపంలో ఒక గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్యాంకర్ నుండి ప్రమాదకరమైన వాయువు లీక్ అవుతుండటంతో, అప్రమత్తమైన అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఎక్స్‌ప్రెస్‌వేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ భారీ ట్రాఫిక్ జామ్‌లో ‘ఎకా మొబిలిటీ’ సంస్థ చైర్మన్ డాక్టర్ సుధీర్ మెహతా కూడా చిక్కుకున్నారు. దాదాపు 8 గంటల పాటు కారులోనే ఉండిపోయిన ఆయన, పరిస్థితి చక్కబడదని గ్రహించి అత్యవసరంగా హెలికాప్టర్‌ను రప్పించుకున్నారు. ట్రాఫిక్ మధ్య నుంచే ఆయన గాలిలో ప్రయాణించి సురక్షితంగా బయటపడ్డారు. తనకు కలిగిన ఈ అనుభవంపై సుధీర్ మెహతా ఎక్స్‌వేదికగా స్పందిస్తూ ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు చేశారు. ఇలాంటి అత్యవసర సమయాల్లో వాహనాలు వెనక్కి వెళ్లేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్‌వేపై ఎగ్జిట్ పాయింట్లు ఉండాలి. అత్యవసర సేవలు అందించేందుకు ఎక్స్‌ప్రెస్‌వే పొడవునా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హెలిప్యాడ్ నిర్మించాలని ఆయన కోరారు. కేవలం రూ.10 లక్షల లోపే వీటి నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఒకే ఒక్క ట్యాంకర్ ప్రమాదం వల్ల వేల మంది గంటల తరబడి రోడ్డుపైనే ఉండిపోవడం మన వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి

తండ్రిని భుజంపై మోస్తూ.. గుండెల్ని పిండేసే ఘటన..

ప్రమాదకర విన్యాసాలతో హైవేపై రెచ్చిపోయిన యువకులు..

గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో భారీ ఊరట

లిఫ్ట్‌లో గ్యాస్ బెలూన్లు తీసుకెళ్తున్న డెలివరీ బోయ్‌.. అంతలోనే.. ఇలా జరుగుతుందని అనుకోలేదు