భారీ ట్రాక్టర్‌ను తన రెక్కలతో ఆపేసిన పక్షి..! గుడ్ల రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టిన మాతృప్రేమ
తన గుడ్లను కాపాడుకోవడం కోసం ఓ చిన్న టిటిరి పక్షి భారీ ట్రాక్టర్‌కు ఎదురొడ్డి నిలిచిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదం దగ్గరపడుతున్నా గుడ్లను వదిలి వెళ్లకుండా రెక్కలు చాచి రక్షణగా నిలిచిన ఆ పక్షి మాతృప్రేమ అందరినీ కదిలించింది. పక్షి ధైర్యాన్ని చూసిన రైతు ట్రాక్టర్‌ను ఆపేయడంతో గుడ్లు సురక్షితంగా బయటపడ్డాయి.
అమ్మ ప్రేమకు హద్దులుండవని, అది కేవలం మనుషులకే కాదు పశుపక్ష్యాదులకూ వర్తిస్తుందని నిరూపించే ఒక అద్భుతమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను కదిలిస్తోంది. తన గుడ్లను కాపాడుకోవడం కోసం ఒక చిన్న టిటిరి పక్షి ఏకంగా ఒక భారీ ట్రాక్టర్‌కు ఎదురొడ్డి నిలిచిన తీరు నెటిజన్లను కదిలిస్తోంది. ఒక పొలంలో ఈ పక్షి నేలపై కొన్ని గుడ్లను పెట్టి పొదుగుతోంది. అదే సమయంలో ఆ పొలాన్ని దున్నుతున్న ఒక రైతు తన ట్రాక్టర్‌ను నేరుగా ఆ గుడ్ల వైపు తీసుకువచ్చాడు. సాధారణంగా అంత పెద్ద వాహనం వస్తుంటే ఏ పక్షి అయినా భయంతో ఎగిరిపోతుంది. కానీ, అక్కడ మాతృప్రేమ భయాన్ని జయించింది. ఆ తల్లి పక్షి తన గుడ్లను వదిలి వెళ్ళడానికి నిరాకరించింది. ప్రమాదం ముంచుకొస్తున్నా సరే, తన రెండు రెక్కలను వెడల్పుగా చాపి, గుడ్లకు రక్షణగా ట్రాక్టర్ చక్రాల ముందర నిలిచింది. ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయిన రైతు వెంటనే ట్రాక్టర్‌ను నిలిపివేసి, ఇంజిన్ ఆపేశాడు. ఆ పక్షి మాతృప్రేమ, గుడ్లను కాపాడుకోడానికి ప్రాణాలను సైతం పణంగా పెట్టిన తపనను చూసి ముగ్దుడైన ఆ రైతు.. ఆ దృశ్యాన్ని తన మొబైల్‌లో రికార్డు చేయగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మనిషి అయినా, పక్షి అయినా తన పిల్లలను రక్షించుకోవడానికి ఎంతటి ప్రమాదాన్నైనా ఎదిరిస్తుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక సాధారణ వెల్డర్.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు!
