ఇంటి కప్పులో శబ్దాలు.. ఏంటని చూసిన ఓనర్ షాక్
నైరుతి ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు ఊపందుకున్నాయి. దీంతో ప్రతిచోటా పాముల సంచారం కూడా పెరిగింది. పుట్టల్లో, పొలాల్లో, అడవుల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా ఇంటి పైకప్పుపై తిష్ట వేసిన పాముకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఇంటి కప్పులో ఏదో శబ్దాలు రావటంతో ఆ ఇంటిలోని వారంతా ఆ శబ్దాలు ఎక్కడోనని ఇల్లంతా వెతికారు.
అయితే, వారికి ఇంటిలో ఏమీ కనిపించలేదు. అయితే ఆ శబ్దాలు మరింత ఎక్కువవడమే కాకుండా ఇంటిపైన ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది. దాంతో ఆ ఇంటి యజమాని ఇంటిపైకి ఎక్కి చూశాడు. అంతే అతనికి గుండె జారినంత పనైంది. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఇంటిపైకప్పులో నక్కిన నాగుపామును బయటకు రప్పించాడు. పామును పట్టుకునే క్రమంలో స్నేక్ క్యాచర్‌పై బుసలుకొడుతూ విరుచుకుపడింది నాగుపాము. అయినా అతను భయపడకుండా దానిని ఎంతో జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్లి అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా.? అయితే.. రిస్కే
తన స్టైల్లో వీరమల్లు సినిమాకు రివ్యూ ఇచ్చిన హైపర్ ఆది
‘సూపర్ హిట్’ డిప్యూటీ సీఎం సినిమాపై.. సీఎం సాబ్ వైరల్ ట్వీట్!
మరీ ఇంత ఏడుపుగొట్టు సినిమానా ఇది! చూసిన వాళ్లందరూ పడీ పడీ ఏడుస్తున్నారుగా
ఆ గ్రామంలో చింత చెట్టే డాక్టర్! చెట్టు కాండం గుండా వెళితే రోగాలు మాయం!