చదువుకుంటాను.. సాయం చేయండి!
మహబూబ్‌నగర్ జిల్లా అల్లీపూర్‌కు చెందిన సందీప్ గౌడ్ తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూనే చదువులో ప్రతిభ చూపించాడు. బోరబండ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో 10/10 జీపీఏ, ఇంటర్ బైపీసీలో 960 మార్కులు సాధించాడు. నీట్‌లో 440 మార్కులతో కొడంగల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందాడు. అయితే కళాశాల, హాస్టల్ ఫీజులు, పుస్తకాలకు ఏటా రూ.1.5 లక్షల వరకు ఖర్చవుతుండటంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు.
తలదాచుకోవడానికి సొంతిల్లు లేదు.. కడుపునిండా తిండి లేదు.. అండగా నిలవాల్సిన తండ్రీ లేడు. ఆకలి, పేదరికం నిత్యం వేధిస్తున్నా వెనకడుగు వేయకుండా చదివి, డాక్టర్ కల నెరవేర్చుకునే దిశగా అడుగులు వేశాడు ఆ యువకుడు. మహబూబ్‌నగర్ జిల్లా అల్లీపూర్‌కు చెందిన సందీప్ గౌడ్ కథ ఇది. కటిక పేదరికాన్ని జయించి కొడంగల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన ఈ యువకుడు, ఇప్పుడు ఫీజులు కట్టలేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. సందీప్ చిన్నతనంలోనే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. దాంతో తల్లి స్వరూప ఇద్దరు పిల్లలను తీసుకుని హైదరాబాద్ చేరింది. అక్కడ రాత్రింబవళ్ళు కష్టపడి టైలరింగ్ చేస్తూ, పైసాపైసా కూడబెట్టి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించింది. తల్లి కష్టాన్ని కళ్లారా చూసిన సందీప్, తల్లి కష్టాలు తీర్చేందుకు కష్టపడి చదువుకోవాలి అనుకున్నాడు..బోరబండ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించాడు. అనంతరం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీలో 960 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. ఎంతో పట్టుదలతో శ్రమించి నీట్ పరీక్ష రాసి 530 మార్కులు సాధించాడు. అది రద్దు కావడంతో మళ్లీ నిర్వహించిన పరీక్షలో 440 మార్కులు పొంది ఎంబీబీఎస్ సీటు దక్కించుకున్నారు. కళాశాల ప్రవేశ రుసుం, హాస్టల్ ఫీజు, పుస్తకాలకు ఏటా లక్షన్నర వరకు ఖర్చవుతుందని, తమకు అంత స్తోమత లేదని ఆ తల్లి దాతల సాయం కోసం వేడుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రైఫ్రూట్స్ ఆర్డర్ డెలివరీ.. క్షణాల్లో ఖాతా ఖాళీ
Elon Musk: మళ్లీ..ప్రపంచ ట్రిలియనీర్‌గా ఎలన్ మస్క్
వినియోగదారులకు గుడ్‌న్యూస్.. నెలరోజులు చాట్‌జీపీ ప్లస్ ఫ్రీ!
అర్ధరాత్రి ఆలయంలో జేసీబీలతో తవ్వకాలు..ఏం జరిగింది
CM Sangma: మేఘాలయ రాష్ట్రంలో తెలుగు సినిమా.. CM సంగ్మా ఎమోషనల్
