Ganesh Chaturthi: రూల్స్ ఫాలో అవుతున్న గణేషుడు.. సీట్ బెల్ట్‌ ధరించిన గణపతి.. ట్రక్కు ముందు సీట్లో ప్రయాణం.. అబ్బా ఎంత బాగుంది..

|

Sep 06, 2022 | 9:07 AM

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూనే ప్రజలకు ఓ సరికొత్త సందేశాన్ని అందించారు. అది చూసిన ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచిస్తున్నారు..?


పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూనే ప్రజలకు ఓ సరికొత్త సందేశాన్ని అందించారు. అది చూసిన ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచిస్తున్నారు..? వైరల్‌ అవుతున్న వీడియోలో..ఒక ట్రక్‌ డ్రైవర్ సీటుపై కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నాడు.. అతని పక్క సీటుపైన గణేశుడి విగ్రహం ఉంది. గ‌మ‌నించాల్సిన విష‌యం ఏంటంటే డ్రైవర్‌ పక్క సీట్లో కూర్చుని ఉన్న వినాయకుడు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాడు. విఘ్నేశుడు కూడా డ్రైవర్ లాగా సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. వాహనదారులకు సీటు బెల్ట్‌ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఉన్న ప్రకటనను ఆనంద్‌ మహీంద్రా విడుదల చేసారు. వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. వీడియో చూసిన ఢిల్లీ టీచర్ మను గులాటీ.. ‘‘గణపతి సీట్ బెల్ట్ ధరించడాన్ని ఎవరైనా చూశారా? అంటూ రీ ట్విట్‌ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా సీటు బెల్ట్ లేకుండా వాహనాలు నడిపే డ్రైవర్ల కోసమే ఈ సందేశం. ఇది నిజంగా అద్భుతమైన వీడియో.. అంటూ భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Follow us on