Lion: సింహం వేటను ప్రత్యక్షంగా చూశారా.. వారెవ్వా ఎమన్నా ఎటాక్‌ నా.. నక్కి నక్కి దాక్కొని మరి ఒక్కసారిగా..

|

Sep 24, 2022 | 1:58 PM

క్రూర జంతువుల జాబితాలో సింహం మొదటి స్థానంలో ఉంటుంది. సింహాలు వేటాడే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వేటాడే సమయంలో కేవలం ఎరపై మాత్రమే దృష్టి నిలిపే ఇవి


క్రూర జంతువుల జాబితాలో సింహం మొదటి స్థానంలో ఉంటుంది. సింహాలు వేటాడే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వేటాడే సమయంలో కేవలం ఎరపై మాత్రమే దృష్టి నిలిపే ఇవి వేటాడేంత వరకు లక్ష్యాన్ని విడిచిపెట్టవు. సింహాలు వేటాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇవి ఆశ్చర్యంతో పాటు, భయాన్ని కూడా కలిగిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ లో సింహం ఒక జంతువును వేటాడేందుకు ఎప్పటినుంచో కాపు కాసుకొని ఉంది.. ఇంతలో అటుగా కొన్ని అడవి దున్నలు పరుగెత్తుకుంటూ వెళ్తున్నాయి. అంతే ఒక్క ఉదుటన వాటిపైన ఎటాక్‌ చేసింది సింహం. దానికి కావలసిన ఆహారాన్ని దక్కించుకుంది. అది పారిపోయేందుకు, విడిపించుకునేందుకు ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. అయినా.. సింహం చేతికి చిక్కాక ఇక ప్రాణాలతో బయటపటడం జరగని పని. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 10 సెకన్లు నిడివి కలిగిన ఈ వీడియోను వేలాదిమంది వీక్షిస్తూ లైక్స్‌తో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

 

Follow us on