Loading video

ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..

|

Mar 21, 2025 | 7:14 PM

ఓ వైపు ఎండలు.. మరోవైపు పాముల బెడదతో ప్రజలు అల్లాడుతున్నారు. అడుగు బటయ పెట్టాలంటే ఎండల భయం.. ఏసీ ఆన్‌చెయ్యాలన్నా, బైక్‌పై ఎక్కడికైనా వెళ్లాలన్నా.. కనీసం కారులో ప్రయాణం చేద్దామన్నా పాములు హడలెత్తిస్తున్నాయి. ఎండవేడిని తట్టుకోలేక అప్పుడే పాములు చల్లని ప్రదేశాలను వెతుక్కుంటూ ఇళ్లలో, వాహనాల్లో తిష్ట వేస్తున్నాయి.

తాజాగా ఓ ఇంట్లోని వాష్‌రూమ్‌లో నాగుపాము బుసలు కొట్టి ఆ ఇంటివారిని పరుగులు పెట్టించింది. ఈ ఘటన విశాఖజిల్లా పెందుర్తిలో జరిగింది. విశాఖ జిల్లా పెందుర్తి .. సరిపల్లెలో చక్రధర్ కుటుంబం ఓ ఇంట్లో నివాసం ఉంటోంది. ఉదయం లేవగానే చక్రధర్‌ వాష్‌రూమ్‌కి వెళ్లాడు. డోర్‌ తెరిచి అడుగు లోపలికి పెట్టగానే అతనికి వింత శబ్దాలు వినిపించాయి. అనుమానం వచ్చిన అతను చుట్టూ చూశాడు ఎక్కడ ఏమీ కనిపించలేదు. ఇక వాష్ రూమ్ కమోడ్‌ దగ్గర శబ్దాలు మరింత పెద్దగా వినిపించడంతో అక్కడకు వెళ్లి చూడగా అతని గుండె ఆగినంత పనైంది. ఒక్క ఉదుటన వాష్‌రూమ్‌ నుంచి బయటకు పరుగెత్తాడు. ఏమైందా అని ఆ ఇంట్లోని వారంతా అక్కడికి చేరారు. వాష్‌రూమ్‌ కమోడ్‌లో కనిపించిన పామును చూసి వణికిపోయారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌

వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..

ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం

బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..

వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి