Kangaroo’s fight: దిమ్మతిరిగే పంచ్‌లు , మతిపోగొట్టే కిక్‌లు.. కంగారూలతో మాములుగా ఉండదు మరి.. చూస్తే నవ్వాపుకోలేరు..

|

Sep 27, 2022 | 9:01 AM

కంగారూలను టీవీ లేదా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటుంటాం. ఎందుకంటే ఇవి ఆస్ట్రేలియాలోనే ఎక్కువగా కనిపించే జంతువులు. ఇవి శాకాహారులు, ప్రశాంత స్వభావం కలిగిన జీవులు ఇవి.


కంగారూలను టీవీ లేదా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటుంటాం. ఎందుకంటే ఇవి ఆస్ట్రేలియాలోనే ఎక్కువగా కనిపించే జంతువులు. ఇవి శాకాహారులు, ప్రశాంత స్వభావం కలిగిన జీవులు ఇవి. అయితే ఒక్కోసారి అవికూడా దూకుడుగా మారతాయి. ఎందుకంటే ఇతర జంతువులనుంచి వాటిని అవి రక్షించుకోవాలి కదా.. తాజాగా ఈ కంగారూలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది. ఇవి కుస్తీ ప్రాక్టీస్‌ చేస్తున్నట్టున్నాయి. సీన్‌ చూస్తే దంగల్‌ సినిమా కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. పంచ్‌లు అదిరిపోయాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ చోట కొన్ని కంగారూలు ఉన్నాయి. వాటిలో రెండు కంగారూలు పోట్లాడుకుంటున్నాయి. ఆ రెండూ ఎగిరెగిరి ఒకదానినొకటి తన్నుకుంటున్నాయి. మధ్యలో ముందరి కాళ్లతో ఒకదాని ముఖంపై మరొకటి సూపర్‌ పంచ్‌లు.. ఈ ఫైట్‌ చూడ్డానికి అవి కుస్తీ ప్రాక్టీస్‌ చేస్తున్నాయా అనిపిస్తుంది. మనుషులు నిలబడి, తన్నుకోవడం, పంచ్‌లతో పోరాడినట్లుగానే, కంగారూలు కూడా ఒక దానితో ఒకటి పోటీపడ్డాయి. తగ్గేదేలే అంటూ ఒకదానిపై ఒకటి పోట్లాడుకున్నాయి. ఇదంతా పక్కనే ఉన్న కంగూరూలు ప్రేక్షకుల్లా వీక్షిస్తూ ఆస్వాదించాయి. ఈ వీడియోను ఓ యూజర్‌ ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దాంతో ఈ వీడియో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. లక్షలమంది నెటిజన్లు వీడియోను వీక్షిస్తూ లైక్‌ చేస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us on