విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..

Updated on: Oct 03, 2026 | 6:21 PM

జపాన్‌లోని అమామి ఓషిమా ద్వీపం ఓ పర్యావరణ తప్పిదానికి దశాబ్దాలపాటు పరిష్కారం వెతికిన అరుదైన ఉదాహరణగా నిలిచింది. 1979లో హబు పాములు, ఎలుకలను నియంత్రించేందుకు తీసుకొచ్చిన సుమారు 30 ముంగీసలు స్థానిక అరుదైన జీవులపై దాడి చేయడం ప్రారంభించాయి. వాటి సంఖ్య వేలల్లోకి పెరగడంతో ప్రభుత్వం 2000 నుంచి నిర్మూలన చర్యలు చేపట్టింది. 45 ఏళ్ల తర్వాత 2024లో ముంగీసలు పూర్తిగా అంతరించినట్లు అధికారికంగా ప్రకటించింది.

ఒక చిన్న పొరపాటు పర్యావరణ వ్యవస్థను ఎలా ముప్పులోకి నెడుతుందో, దాన్ని సరిదిద్దడానికి ఎన్ని దశాబ్దాల శ్రమ అవసరమవుతుందో చెప్పడానికి జపాన్‌లోని ‘అమామి ఓషిమా’ ద్వీపం కథే నిదర్శనం. 1979లో జపాన్‌లోని అమామి ఓషిమా ద్వీపంలో అత్యంత విషపూరితమైన ‘హబు’ పాములు, ఎలుకల సంఖ్యను అదుపు చేయడానికి ఒకినావా నుండి సుమారు 30 ‘చిన్న భారతీయ ముంగీసలను’ తీసుకువచ్చి విడుదల చేశారు. పాములను ఏరిపారేస్తాయనుకున్న ఈ ముంగీసలు, అనుకున్న ప్రణాళికను తారుమారు చేశాయి. హబు పాములు రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటే, ముంగీసలు పగటిపూట వేటాడేవి. దీంతో ముంగీసలు పాములను వదిలేసి, ఆ ద్వీపంలో మాత్రమే కనిపించే అరుదైన అమామి కుందేళ్లు, కప్పలు, ఎలుకలు, పక్షులను ఆహారంగా తీసుకోవడం ప్రారంభించాయి. కాలక్రమేణా ఈ ముంగీసలు వేగంగా సంతానోత్పత్తి చేసి, కాలానుగుణంగా వాటి సంఖ్యను ఏకంగా 10,000కు పెంచుకున్నాయి. దీనివల్ల ద్వీపంలోని స్థానిక అరుదైన జీవజాతులు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందని గుర్తించిన జపాన్ ప్రభుత్వం, 2000వ సంవత్సరం నుండి ఈ ముంగీసల నిర్మూలనకు బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం ‘అమామి ముంగూస్ బస్టర్స్’ పేరుతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. పర్వత ప్రాంతాలతో కూడిన ఈ ద్వీపంలో 35,000 కంటే ఎక్కువ ఉచ్చులు, 500కు పైగా ఆటోమేటిక్ కెమెరాలు, శిక్షణ పొందిన ప్రత్యేక కుక్కలను ఉపయోగించి ముంగీసలను ఏరివేసే ఆపరేషన్ నిర్వహించారు. చివరిసారిగా ఏప్రిల్ 2018లో ఒక ముంగీస చిక్కింది. ఆ తర్వాత ఆరేళ్ల పాటు కెమెరాలు, కుక్కలు, తీవ్ర తనిఖీల ద్వారా పర్యవేక్షించినప్పటికీ ఒక్క ముంగీస కూడా కనిపింలేదు. గణాంకాల మోడలింగ్ ఆధారంగా ముంగీసలు పూర్తిగా నిర్మూలించబడ్డాయని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. సెప్టెంబర్ 3, 2024న జపాన్ పర్యావరణ మంత్రిత్వ శాఖ అమామి ఓషిమా ద్వీపం నుండి ముంగీసలు పూర్తిగా అంతరించినట్లు అధికారికంగా ప్రకటించింది. 45 ఏళ్ల తర్వాత సాధించిన ఈ అరుదైన విజయంతో, అమామి కుందేళ్లు మరియు ఇతర అరుదైన స్థానిక జీవులు మళ్లీ తమ సంతతిని పెంచుకుంటూ స్వేచ్ఛగా జీవిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!

ఏనుగునైనా చంపే కింగ్‌ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో చూస్తే షాక్!

హైటెక్ సిటీ స్టేషన్‌లో 10 రైళ్లకు హాల్ట్! ఇక ఆఫీస్ నుంచి నేరుగా మీ సొంతూరికి

Ba Ba Black Sheep: పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు చేస్తుంది

Loading...
Unable to load recommendations.
Follow Us