రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము

Updated on: Apr 12, 2026 | 6:41 PM

జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గత వారం రోజులుగా ఓ భారీ నాగుపాము దర్శనమిస్తోంది. నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. భక్తులు దీనిని దైవలీలగా భావించి పూజిస్తుండగా, ఆలయ సిబ్బంది మాత్రం భయంతో విధులు నిర్వర్తించలేకపోతున్నారు. ఈ వింత సంఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

అది ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం.. నిత్యం శివనామస్మరణతో మార్మోగే పవిత్ర నిలయం. అటువంటి చోట గత వారం రోజులుగా ఒక భారీ నాగుపాము చేస్తున్న విన్యాసాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా పాములు కనిపిస్తే జనం పరుగులు తీస్తారు. కానీ, ఈ ఆలయంలో గత వారం రోజులుగా ఒక భారీ నాగుపాము నందీశ్వరుడి విగ్రహం చుట్టూ పడగ విప్పి ప్రదక్షిణలు చేస్తూ భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. సుమారు వారం రోజులుగా ప్రధాన గర్భగుడి ద్వారం వద్ద ఈ పాము ప్రత్యక్షమవుతోంది. రోజూ నంది విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసి వెళ్తోంది. దీంతో భక్తులు ఇది కేవలం యాదృచ్ఛికం కాదని , అంతా దైవలీల అని భక్తులు నమ్ముతున్నారు. ఆలయ ప్రాంగణంలో నాగుపాము పడగ విప్పి నిశ్చలంగా ఉండటం చూసి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నారు. సాక్షాత్తూ ఆ పరమశివుడే పాము రూపంలో దర్శనమిస్తున్నాడని భావించి, భయం విడిచి దానికి పూజలు చేస్తూ, నమస్కారాలు చేస్తున్నారు. శివయ్య మెడలోని హారమే ఇలా నందీశ్వరుడి చెంతకు వచ్చిందని కొందరు చర్చించుకుంటున్నారు. భక్తులు భక్తితో చూస్తున్నా, ఆలయ సిబ్బంది మాత్రం గత వారం రోజులుగా ప్రాణభయంతో వణికిపోతున్నారు. గర్భగుడి పరిసరాల్లో పాము తిరుగుతుండటంతో విధులు నిర్వహించడం కష్టతరంగా మారిందని వారు చెబుతున్నారు. అయితే, కొద్దిసేపు ఆలయ ఆవరణలో సంచరించిన తర్వాత, ఆ నాగుపాము మెట్ల మార్గం గుండా కిందికి వెళ్లి.. అక్కడే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వెనుక ఉన్న పుట్టలోకి వెళ్లిపోతోందని సిబ్బంది వెల్లడించారు. ఆధ్యాత్మికతకు నిలయమైన పాలకుర్తి క్షేత్రంలో నాగుపాము సంచారం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ అద్భుతాన్ని చూడటానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jailer 2: జైలర్‌2 లో పవన్‌.. ఇంతకీ నిజమేనా ??

వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్‌

పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి

UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే

డీజిల్ ట్యాంకర్ బోల్తా.. పండగచేసుకున్న జనం

Loading...
Unable to load recommendations.
Follow Us